By: Rama Krishna Paladi | Updated at : 14 Jul 2023 10:41 AM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 14 July 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం మోస్తరు లాభాల్లో మొదలయ్యాయి. ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 28 పాయింట్లు పెరిగి 19,442 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 75 పాయింట్లు పెరిగి 65,633 వద్ద కొనసాగుతున్నాయి. ఐటీ రంగం షేర్లకు డిమాండ్ పెరిగింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,558 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,775 వద్ద మొదలైంది. 65,615 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,917 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 75 పాయింట్ల లాభంతో 65,633 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 19,413 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 19,493 వద్ద ఓపెనైంది. 19,436 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,520 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 28 పాయింట్లు పెరిగి 19,442 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,860 వద్ద మొదలైంది. 44,729 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,923 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 87 పాయింట్లు పెరిగి 44,752 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 18 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, హిందాల్కో, ఇన్ఫీ, టెక్ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు నష్టపోయాయి. మీడియా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ సూచీలు పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేం లేవు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,000గా ఉంది. కిలో వెండి రూ.1500 పెరిగి రూ.77,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.420 పెరిగి రూ.25,610 వద్ద ఉంది.
Also Read: లాభం, ఆదాయం రెండూ మిస్ మ్యాచింగ్ - విప్రో ప్రాఫిట్ ₹2,870 కోట్లు
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Congratulations Senco Gold Limited on getting listed on NSE today! Senco Gold Limited is a pan-India jewellery retailer and they offer costume jewellery, gold, and silver coins, and utensils made of silver. The products are sold under its brand name "Senco Gold & Diamonds. The… pic.twitter.com/UhXMnicIrF
— NSE India (@NSEIndia) July 14, 2023
The #NSEBell has rung in the celebration of the listing ceremony of Senco Gold Limited on NSE today! #NSE #NSEIndia #listing #IPO #StockMarket #ShareMarket #SencoGoldLimited @ashishchauhan pic.twitter.com/LsXt0B2Ctm
— NSE India (@NSEIndia) July 14, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !
CM Chandrababu: 'నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు' - పింఛన్ తొలగింపు ప్రచారంపై సీఎం చంద్రబాబు స్పష్టత
TG HighCourt: హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు క్వాష్ పిటిషన్లు - ఆ నోటీసులను సవాల్ చేస్తూ నిర్ణయం