By: ABP Desam | Updated at : 13 Jan 2023 03:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Opening 13 January 2023:
భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. ఉదయం ఊగిసలాడిన సూచీలు ఐరోపా మార్కెట్లు తెరిచాక ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 98 పాయింట్ల లాభంతో 17,856 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 303 పాయింట్ల లాభంతో 60,261 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 21 పైసలు బలపడి 81.34 వద్ద స్థిరపడింది.
BSE Sensex
క్రితం సెషన్లో 59,958 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,044 వద్ద మొదలైంది. 59,628 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,418 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 303 పాయింట్ల లాభంతో 60,261 వద్ద ముగిసింది.
NSE Nifty
గురువారం 17,858 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,867 వద్ద ఓపెనైంది. 17,774 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,999 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 98 పాయింట్ల లాభంతో 17,856 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,171 వద్ద మొదలైంది. 41,885 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,453 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 289 పాయింట్లు పెరిగి 42,371 వద్ద ముగిసింది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐచర్ మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫీ షేర్లు లాభపడ్డాయి. టైటాన్, ఎస్‌బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, నెస్లే ఇండియా, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు స్వల్పంగా ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎగిశాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్లకు భారీ ఊరట, ఇకపై ఒకరోజు ముందే ఖాతాలోకి డబ్బు
Stock Market Crash: రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్లు - లక్షల కోట్ల నష్టంతో ఇన్వెస్టర్ల కన్నీరు!
Stock Market News: చల్లారని అదానీ హిండెన్ బర్గ్ కుంపటి - పతనం దిశగా స్టాక్ మార్కెట్లు!
Stock Market News: తల్లడిల్లిన ఇన్వెస్టర్లు - ఉద్యోగ కోతలతో మాంద్యం భయాలు, పతనమైన సూచీలు!
Stock Market News: స్టాక్ మార్కెట్లో కల్లోలం - గంటలో రూ.2.5 లక్షల కోట్లు లాస్!
Australian Open 2023: 2023ను రికార్డుతో మొదలెట్టిన ‘జోకర్’ - పదో ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం!
Nellore Rural MLA: నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు ! వైసీపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మొన్న బాలకృష్ణ, నేడు చిరంజీవి - వివాదాలకు కేరాఫ్ గా సక్సెస్ మీట్లు? ఇంతకీ ఏమైంది?
Gujarat Junior Clerk Exam Cancel: హైదరాబాద్‌లో పేపర్ లీకేజీ కలకలం, జూనియర్ క్లర్క్ ఎగ్జామ్ రద్దు చేసిన గుజరాత్