By: ABP Desam | Updated at : 03 Mar 2023 10:37 AM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Opening 03 March 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం రైజ్‌లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. అమెరికాకు చెందిన జీక్యూజీ పాట్నర్స్ అదానీ గ్రూప్‌లో రూ.15,446 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసింది. అప్పులు తీర్చేందుకు అదానీ ప్రణాళికలు అమలు చేస్తుండటం మార్కెట్లో పాజిటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 202 పాయింట్లు పెరిగి 17,524 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 682 పాయింట్లు ఎగిసి 59,591 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 58,909 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,241 వద్ద మొదలైంది. 59,231 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,591 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 682 పాయింట్ల లాభంతో 59,591 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,321 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,451 వద్ద ఓపెనైంది. 17,427 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,527 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 202 పాయింట్లు పెరిగి 17,524 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 40,671 వద్ద మొదలైంది. 40,605 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,045 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 650 పాయింట్లు పెరిగి 41,039 వద్ద కొనసాగుతోంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 46 కంపెనీలు లాభాల్లో 4 నష్టాల్లో ఉన్నాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సెమ్, ఏసియన్ పెయింట్స్, గ్రాసిమ్, బజాజ్ ఆటో షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఆకుపచ్చ రంగులో కళకళలాడుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంకు, ప్రైవేటు బ్యాంకు, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎక్కువ ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.56,450 గా ఉంది. కిలో వెండి రూ.400 పెరిగి రూ.66,900 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.25,440 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Your trading password is the key to your investments. It's important to keep your account safe and secure.
— NSE India (@NSEIndia) March 3, 2023
For more information visit: https://t.co/9wkVNEaKXk#DosAndDonts #InvestorAwareness #StockMarket #ShareMarket #Investment #InvestorProtection @ashishchauhan @psubbaraman
Do you know the correct answer? Write your answer in the comments!#NSEQuiz #Quiz #StockMarket #ShareMarket #StockMarketIndia #Investor #InvestorEducation #Trading #StockTrading pic.twitter.com/dZWkzDnAsX
— NSE India (@NSEIndia) March 2, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!