By: ABP Desam | Updated at : 11 Oct 2022 10:49 AM (IST)
Edited By: Arunmali
ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 'సిప్' డబ్బు
Mutual Funds: ప్రపంచ స్థాయి అనిశ్చితుల కారణంగా కొంతకాలంగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి. సెప్టెంబరులో సెన్సెక్స్ & నిఫ్టీ తలో 3.5% పైగా పడిపోయాయి. మార్కెట్ పరిస్థితులు బాగోలేకపోయినా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి మాత్రం డబ్బుల వరద పారుతోంది. వేల కోట్ల రూపాయలు వచ్చి పడుతున్నాయి.
ఆల్ టైమ్ గరిష్ట స్థాయి
అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (AMFI -యాంఫీ) విడుదల చేసిన సమాచారం ప్రకారం, సెప్టెంబర్‌లో ఈక్విటీ పథకాల్లోకి ₹14,100 కోట్ల నికర మొత్తం వచ్చి పడింది. ఇందులో, 'సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్'ల (SIP - సిప్) మార్గంలో వచ్చిన ప్రవాహమే అధికం. సిప్ రూట్‌లో, ఆగస్టులో వచ్చిన ₹12,693 కోట్లతో పోలిస్తే సెప్టెంబర్‌లో ₹12,976 కోట్లు వచ్చాయి. ఇది కొత్త ఆల్ టైమ్ గరిష్ట స్థాయి.
సిప్ పెట్టుబడులు నెలకు రూ.13,000 కోట్లకు చేరే రోజు దగ్గరలోనే ఉందని యాంఫీ అంచనా వేసింది.
మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న సగటు ఆస్తులు (AUM) ఆగస్టులోని ₹39.53 లక్షల కోట్ల నుంచి కొద్దిగా పెరిగి సెప్టెంబర్‌లో ₹39.88 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే, మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మొత్తం AUM సెప్టెంబర్‌లో ₹92,000 కోట్లు క్షీణించి ₹38.42 లక్షల కోట్లకు చేరుకుంది.
దేశీయ పరిస్థితులు ఆరోగ్యంగా ఉండటం, కార్పొరేట్ ఆదాయాల ఔట్‌లుక్ బాగుంది. కాబట్టి, స్వల్పకాలిక గ్లోబల్ హెడ్‌విండ్‌లను ఎదుర్కోవడానికి పెట్టుబడిదారులు సిద్ధంగా ఉన్నారు. అందుకే సిప్ మొత్తాలు పెరిగాయి - యూనియన్ మ్యూచువల్ ఫండ్
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోని అన్ని కేటగిరీల్లోకి గరిష్ట మొత్తాలు వచ్చాయి. సెక్టార్ స్కీమ్స్ అత్యధికంగా ₹4,419 కోట్ల ఇన్‌ఫ్లోస్‌ను చూసాయి. డైవర్సిఫైడ్ కేటగిరీల్లో.. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ అత్యధికంగా ₹2,401 కోట్లు, మిడ్ క్యాప్ ఫండ్స్ ₹2,151 కోట్లు, స్మాల్ క్యాప్ ఫండ్స్ ₹1,825 కోట్లు ఆకర్షించాయి.
డెట్ ఫండ్స్‌లో ఔట్ ఫ్లో
కార్పొరేట్ కంపెనీలు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించేందుకు డబ్బును వెనక్కు తీసుకోవడంతో, డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి సెప్టెంబర్ నెలలో ₹65,372 కోట్ల మేర బయటకు వెళ్లిపోయాయి. లిక్విడ్ ఫండ్స్ నుంచే రూ.59,970 కోట్ల ఔట్ ఫ్లో ఉంది. అల్ట్రా షార్ట్, లో డ్యూరేషన్ ఫండ్స్ కూడా ₹16,000 కోట్ల విత్‌డ్రాల్స్ చూశాయి. మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి ₹11,232 కోట్లు వెనక్కు మళ్లాయి. అయితే, ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి ₹33,128 కోట్ల ఇన్‌ఫ్లోలు వచ్చాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market Today: సూచీల ఊగిసలాట! లాభాల్లోంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్న నిఫ్టీ, సెన్సెక్స్
Stock Market Today: వరుస నష్టాలకు తెర! రీబౌండ్ అయిన నిఫ్టీ, సెన్సెక్స్
Stock Market Crash: వణికించిన స్టాక్ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్
Stock Market Update: రక్తమోడుతున్న స్టాక్ మార్కెట్లు! నేడు రూ.1.92 లక్షల కోట్ల సంపద ఆవిరి!
Stock Market Today: 20,200 టచ్ చేసిన నిఫ్టీ - 320 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Joinings in Telangana Congress: కాంగ్రెస్‌లో చేరుతున్న కీలక నేతలు-ఢిల్లీ వేదికగా జాయినింగ్స్
Justin Trudeau: ఆ సమాచారాన్ని ముందే భారత్‌కు చెప్పాం - జస్టిన్ ట్రూడో
YSRCP : సమస్యల్లో టీడీపీ - పల్లెలకు వైసీపీ ! అధికార పార్టీ మాస్టర్ ప్లాన్
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త, సూపర్ సేవర్-59 ఆఫర్ అందుబాటులోకి!
/body>