By: ABP Desam | Updated at : 01 Jul 2022 12:10 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Getty )
Stock Market @ 12 PM 1 July 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) శుక్రవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. రూపాయి విలువ పడిపోతుండటం మదుపర్లను కలవరపెడుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 187 పాయింట్ల నష్టంతో 15,511, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 588 పాయింట్ల నష్టంతో 52,437 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,018 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 52,863 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,094 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,863 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 588 పాయింట్ల నష్టంతో 52,437 వద్ద కొనసాగుతోంది. ఒకానొక దశలో 1000 పాయింట్ల వరకు పడ్డ సూచీ ఆ తర్వాత రికవరీ బాట పట్టింది.
NSE Nifty
గురువారం 15,780 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 15,703 వద్ద ఓపెనైంది. 15,511 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,719 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 187 పాయింట్ల నష్టంతో 15,591 వద్ద కొనసాగుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ఉంది. ఉదయం 33,264 వద్ద మొదలైంది. 33,080 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,343 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 188 పాయింట్ల నష్టంతో 33,236 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, సిప్లా, ఐటీసీ, బీపీసీఎల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, రిలయన్స్, టైటాన్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, రియాల్టీ షేర్లకు గిరాకీ ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్, కన్జూమర్ డ్యురబుల్స్, మెటల్, ఐటీ, బ్యాంకు, ఆటో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
Stock Market Weekly Review: 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు! 60K దాటితే సెన్సెక్స్‌ను ఆపలేం!
Top Loser Today August 11, 2022 స్టాక్ మార్కెట్ సెన్సెక్స్, నిఫ్టీ టాప్ లాసర్స్ జాబితా
టాప్ గెయినర్స్ August 11, 2022 : స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ టాప్ గెయినర్స్
Stock Market Closing: నష్టాల్లో మొదలై లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ!
Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్
KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ
Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!