By: ABP Desam | Updated at : 20 Sep 2023 03:56 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్, ( Image Source : Pexels )
Stock Market Closing, 20 September 2023:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం చుక్కలు చూపించాయి. ఆరంభం నుంచి నేల చూపులు చూశాయి. క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకడం, డాలర్ ఇండెక్స్ విపరీతంగా పెరగడం, యూఎస్ బాండ్ యీల్డుల పెరుగుదల వంటివి పతనానికి ప్రధాన కారణాలు. వీటికి ద్రవ్యోల్బణం, వినియోగ వస్తువుల ధరల పెరుగుదల, విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం వంటివి దోహదం చేశాయి. దాంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 231 పాయింట్లు తగ్గి 19,901 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 796 పాయింట్లు పతనమై 66,800 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలహీనపడి 83.08 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు నేడు ఒక్క రోజే రూ.3 లక్షల కోట్ల మేర సంపద కోల్పోయారు.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 67,596 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 67,080 వద్ద మొదలైంది. 66,728 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 67,294 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 796 పాయింట్ల నష్టంతో 66,800 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 20,133 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 19,980 వద్ద ఓపెనైంది. 19,878 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 20,050 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 231 పాయింట్లు తగ్గి 19,901 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ ఎరుపెక్కింది. ఉదయం 45,493 వద్ద మొదలైంది. 45,276 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,745 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 595 పాయింట్ల నష్టంతో 45,384 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 11 కంపెనీలు లాభాల్లో 39 నష్టాల్లో ఉన్నాయి. పవర్ గ్రిడ్ (2.35%), కోల్ ఇండియా (1.12%), ఓఎన్జీసీ (0.75%), ఏసియన్ పెయింట్స్ (0.57%), సన్ ఫార్మా (0.44%) షేర్లు లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్సీ బ్యాంకు (3.87%), జేఎస్‌డబ్ల్యూస్టీల్ (2.70%), రిలయన్స్ (2.29%), బీపీసీఎల్ (2.07%), అల్ట్రాటెక్ సెమ్ (2.06%) షేర్లు నష్టపోయాయి. నేడు అన్ని రంగాల సూచీలు పతనమయ్యాయి. ఫైనాన్స్, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక శాతానికి పైగా ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పేమీ లేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.10 పెరిగి రూ.60,230 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.300 తగ్గి రూ.74,500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.130 పెరిగి రూ.25,050 వద్ద ఉంది.
క్రితం సెషన్లో ఏం జరిగిందంటే?
స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. హాంకాంగ్, సింగ్‌పూర్, కొరియా సూచీలు ఎరుపెక్కగా మొన్నటి వరకు పతనమైన చైనా సూచీలు పుంజుకున్నాయి. ఈ వారం యూఎస్ ఫెడ్ సమావేశం కానుండటం, ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు పెరుగుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పైగా భారత సూచీలన్నీ గరిష్ఠాల్లోనే ఉండటంతో ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడే సూచనలు కనిపిస్తున్నాయి. నిఫ్టీ 50 కీలకమైన 20,100 లెవల్‌ను నిలబెట్టుకుంది. సెన్సెక్స్ 241 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలహీనపడి 83.27 వద్ద స్థిరపడింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!