By: Rama Krishna Paladi | Updated at : 04 Jul 2023 03:51 PM (IST)
స్టాక్ మార్కెట్ న్యూస్ ( Image Source : Pexels )
Stock Market Closing 4 July 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ముగిశాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైనా క్రమంగా కొనుగోళ్లు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 66 పాయింట్లు పెరిగి 19,389 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 274 పాయింట్లు పెరిగి 65,479 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 6 పైసలు బలహీనపడి 82.02 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,205 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,503 వద్ద మొదలైంది. 65,171 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,672 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 274 పాయింట్ల లాభంతో 65,479 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 19,322 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 19,406 వద్ద ఓపెనైంది. 19,300 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,434 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 66 పాయింట్ల లాభంతో 19,389 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 45,310 వద్ద మొదలైంది. 45,000 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,655 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 143 పాయింట్లు పెరిగి 45,301 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 21 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, హీరోమోటో కార్ప్, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, భారతీ ఎయిర్‌టెల్, గ్రాసిమ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ప్రైవేటు బ్యాంక్, రియాల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.59,060గా ఉంది. కిలో వెండి రూ.200 తగ్గి రూ.71,700 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.210 పెరిగి రూ.24,020 వద్ద ఉంది.
Also Read: అద్దెకు ఉంటున్నారా! టెనెంట్‌గా ఈ హక్కులు మీకున్నాయని తెలుసా!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
As a smart investor, only deal with registered SEBI stockbrokers! Know more: https://t.co/6EIJrMfLod#NSEIndia #SochKarSamajhKarInvestKar #InvestorAwareness #StockMarket #InvestorEducation #ShareMarket #InvestorProtection @ashishchauhan
— NSE India (@NSEIndia) July 4, 2023
Full-scale operations of NSE IX -SGX Connect commenced today with $8.05bn open interest in Nifty future and over $1.04bn open interest in Nifty Options .
— NSE IX (@nse_ix) July 3, 2023
The first session hit a new milestone with traded volume of US$1.13billion.@NSEIXGiftNifty @AshishChauhan @balav1971… pic.twitter.com/yP2cc7V745
Press Release: NSE IX – SGX GIFT Connect becomes Fully Operational. Know more: https://t.co/CSAFdUTrII@NSEIXGiftNifty @AshishChauhan @balav1971 @nseindia #GiftNifty #NSEIX pic.twitter.com/zuO9MNQBs2
— NSE IX (@nse_ix) July 3, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్