By: ABP Desam | Updated at : 31 Mar 2023 04:06 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్‌డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 31 March 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం అదుర్స్ అనిపించాయి. ఈ ఆర్థిక ఏడాది చివరి రోజు దుమ్మురేపాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 279 పాయింట్లు పెరిగి 17,359 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 1031 పాయింట్లు పెరిగి 58,991 వద్ద ముగిశాయి. డీమెర్జ్ వార్తలతో రిలయన్స్ దూసుకెళ్లింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 15 పైసలు బలపడి 82.18 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,960 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,273 వద్ద మొదలైంది. 58,273 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,068 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 1031 పాయింట్ల లాభంతో 58,991 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,080 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,210 వద్ద ఓపెనైంది. 17,204 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,381 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 279 పాయింట్లు పెరిగి 17,359 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 40,231 వద్ద మొదలైంది. 40,180 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 40,690 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 698 పాయింట్లు పెరిగి 40,608 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 43 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ముగిశాయి. రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, నెస్లే ఇండియా, ఇన్ఫీ, టాటా మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఏసియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.60,000 గా ఉంది. కిలో వెండి రూ.700 పెరిగి రూ.74,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.510 తగ్గి రూ.26,050 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Don't be swayed by unrealistic promises of assured/guaranteed returns in stock market. Be a smart investor https://t.co/6EIJrMfdyF #AssuredReturns #FixedReturns #GuaranteedReturns #StockMarket #InvestorAwareness #NSEIndia @ashishchauhan @psubbaraman pic.twitter.com/WhxUhfM6pT
— NSE India (@NSEIndia) March 31, 2023
Don't be swayed by unrealistic promises of assured/guaranteed returns in stock market. Be a smart investor https://t.co/6EIJrMfdyF #AssuredReturns #FixedReturns #GuaranteedReturns #StockMarket #InvestorAwareness #NSEIndia @ashishchauhan @psubbaraman pic.twitter.com/IjNaVv3fWM
— NSE India (@NSEIndia) March 31, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు