By: ABP Desam | Updated at : 30 May 2023 04:03 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing, 30 May 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం మోస్తరు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు ఐరోపా మార్కెట్లు తెరిచాక ఊపందుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 35 పాయింట్లు పెరిగి 18,633 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 122 పాయింట్లు ఎగిసి 62,969 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 8 పైసలు బలహీనపడి 82.71 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,846 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,839 వద్ద మొదలైంది. 62,737 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 63,036 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 122 పాయింట్ల లాభంతో 62,969 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,598 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,606 వద్ద ఓపెనైంది. 18,575 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,662 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 35 పాయింట్లు పెరిగి 18,633 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 44,277 వద్ద మొదలైంది. 44,207 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,498 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 124 పాయింట్లు పెరిగి 44,436 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 22 కంపెనీలు లాభాల్లో 26 నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఫిన్‌షర్వ్, కొటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్ నష్టపోయాయి. బ్యాంక్, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ప్రైవేటు బ్యాంక్ రంగాల సూచీలు ఎగిశాయి. ఆటో, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50 తగ్గి రూ.60,550గా ఉంది. కిలో వెండి రూ.77000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.90 పెరిగి రూ.27,240 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది
Shri Sundararaman Ramamurthy, MD & CEO of @BSEIndia, speaking at the listing ceremony of @TheOfficialSBI USD 750 million bonds on @india_inx under its 10 billion MTN program. @SundaramanR pic.twitter.com/b3v2KQqMDJ
— BSE India (@BSEIndia) May 29, 2023
@BSEIndia @SundaramanR @india_inx https://t.co/iJsMKNJO0R
— BSE India (@BSEIndia) May 29, 2023
Congratulations to Dr. Reddy's Laboratories Ltd. for completing 20 years of listing in NSE.#Listed #ListingAnniversary #Nifty50 #Nifty50Companies #ShareMarket #StockMarket @ashishchauhan pic.twitter.com/eSiO4jJOgI
— NSE India (@NSEIndia) May 30, 2023
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
JC Prabhakar Reddy: అనంతపురంలో జేసీ దివాకర్‌రెడ్డి బస్‌కు నిప్పు పెట్టింది ఆర్‌ఎస్‌ఎస్ నేతలే- జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Telangana News: తెలంగాణలో రేషన్‌కార్డుదారులకు గుడ్ న్యూస్- సన్నబియ్యం పంపిణీ ఎప్పటి నుంచి అంటే?
Woman Life Rs. 5 Lakh: మహిళ ప్రాణం ఖరీదు 5 లక్షల రూపాయలు, ప్రాణాలకు విలువ కట్టిన ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాకం
Aus Vs Ind 5th Test Live Updates: అదే కథ.. అదే వ్యథ.. మళ్లీ విఫలమైన భారత బ్యాటర్లు.. ఆదుకున్న జడేజా, పంత్