By: ABP Desam | Updated at : 18 Apr 2023 04:01 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : istockphoto )
Stock Market Closing 18 April 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. చివర్లో ఐటీ కంపెనీల షేర్లకు గిరాకీ లభించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 46 పాయింట్లు తగ్గి 17,660 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 183 పాయింట్లు తగ్గి 59,727 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 7 పైసలు బలపడి 82.04 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,910 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 59,991 వద్ద మొదలైంది. 59,579 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,113 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 183 పాయింట్ల నష్టంతో 59,727 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 17,706 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 17,766 వద్ద ఓపెనైంది. 17,610 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,766 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 46 పాయింట్లు తగ్గి 17,660 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 42,406 వద్ద మొదలైంది. 42,114 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,500 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 2 పాయింట్లు పెరిగి 42,265 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 21 కంపెనీలు లాభాల్లో 29 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, హెచ్‌సీఎల్ టెక్, సిప్లా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, నెస్లే ఇండియా షేర్లు లాభపడ్డాయి. పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సెమ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అపోలో హాస్పిటల్స్, టైటన్ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్ సూచీలు ఎగిశాయి. ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.60,920గా ఉంది. కిలో వెండి రూ.1100 తగ్గి రూ.77,400 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.330 పెరిగి రూ.27,660 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Congratulations MOS Utility Limited on getting listed on NSE Emerge today! Public Issue was of Rs. 4996.54 lakhs at an issue price of Rs. 76 per share. #NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #MOSUtility @ashishchauhan pic.twitter.com/TG9ezBLfaC
— NSE India (@NSEIndia) April 18, 2023
Congratulations Avalon Technologies Limited on getting listed on the Exchange today!
— NSE India (@NSEIndia) April 18, 2023
Avalon Technologies Limited is a leading fully integrated Electronic Manufacturing Services ("EMS") company. Avalon offers a full stack product and solution suite, right from printed circuit… pic.twitter.com/7hOn1TJwkN
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్ ఆర్డర్!