By: ABP Desam | Updated at : 17 Mar 2023 04:15 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్
Stock Market Closing 17 March 2023:
స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. మధ్యాహ్నం ప్రాఫిట్ బుకింగ్ జరిగినా సాయంత్రానికి సూచీలు మళ్లీ ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్లు పెరిగి 17,100 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 355 పాయింట్లు ఎగిసి 57,989 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు బలపడి 82.71 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 57,634 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 58,038 వద్ద మొదలైంది. 57,503 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 58,178 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 355 పాయింట్ల లాభంతో 57,989 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 16,985 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,111 వద్ద ఓపెనైంది. 16,958 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,145 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 114 పాయింట్లు పెరిగి 17,100 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 39,442 వద్ద మొదలైంది. 38,926 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,705 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 465 పాయింట్లు పెరిగి 39,598 వద్ద స్థిరపడింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 37 కంపెనీలు లాభాల్లో 13 నష్టాల్లో ముగిశాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హిందాల్కో, అల్ట్రాటెక్ సెమ్, యూపీఎల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు లాభపడ్డాయి. ఐచర్ మోటార్స్, ఎన్‌టీపీసీ, మారుతీ, ఐటీసీ, పవర్ గ్రిడ్ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ, మెటల్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.270 పెరిగి రూ.58,690 గా ఉంది. కిలో వెండి రూ.600 పెరిగి రూ.69,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.530 పెరిగి రూ.26,030 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Invest Right Toh Future Bright!
— BSE India (@BSEIndia) March 17, 2023
Visit https://t.co/ni4rMKm1RF to know safe investing practices.#Investor #Investment #InvestorAwareness pic.twitter.com/OwsqKhg5pv
Ambassador of Norway, Mr. Hans Jacob Frydenlund & other delegates from Consulate of Norway visited @BSEIndia, interacted with Ms. Kamala K, Chief Risk Officer, BSE, rang the #BSEBell & did a photo opp with the #BSEBull on 16th March, 2023. #NorwayinIndia #BSE @norwayinindia pic.twitter.com/p6yyvvtUs9
— BSE India (@BSEIndia) March 16, 2023
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Zainab Ravdjee : అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
Maruti Suzuki Export Record: విదేశాల్లోనూ దూసుకుపోతున్న మారుతి సుజుకి - ఏకంగా 30 లక్షల అమ్మకాలతో..!