By: Rama Krishna Paladi | Updated at : 17 Aug 2023 03:51 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pexels )
Stock Market Closing 17 August 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా నష్టపోయాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం ఎక్కువగా ఉంటోంది. యూఎస్ ఫెడ్ మినట్స్ విడుదల అవ్వడం, ఐరోపా, అమెరికా ఎకానమీ బలహీనంగా ఉండటం నెగెటివ్ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 99 పాయింట్లు తగ్గి 19,365 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 388 పాయింట్లు తగ్గి 65,151 వద్ద ముగిశాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ యీల్డ్‌ల పెరుగుదలతో రూపాయి బలహీనపడింది. 20 పైసల నష్టంతో 83.15 వద్ద స్థిరపడింది. పీఎస్‌యూ బ్యాంకు షేర్లు మాత్రం దూకుడు కనబరుస్తున్నాయి.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 65,539 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 65,503 వద్ద మొదలైంది. 65,046 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,535 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 388 పాయింట్ల నష్టంతో 65,151 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 19,465 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,450 వద్ద ఓపెనైంది. 19,326 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,461 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 99 పాయింట్లు నష్టపోయి 19,365 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,897 వద్ద మొదలైంది. 43,745 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,071 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 55 పాయింట్లు తగ్గి 43,891 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 15 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్, టైటాన్, బజాజ్ ఆటో, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు లాభపడ్డాయి. ఎల్‌టీఐ మైండ్‌ట్రీ, ఐటీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎల్‌టీ షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి. పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, కన్జూమర్ డ్యురబుల్స్ పెరిగాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 తగ్గి రూ.59,020 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.500 తగ్గి రూ.72500 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.170 తగ్గి రూ.23,700 వద్ద ఉంది.
Also Read: గుడ్‌న్యూస్! రూ.13,000 కోట్లతో కులవృత్తుల వారికి మోదీ కొత్త పథకం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Chandrababu About NTR: మనం చూసిన ఏకైక యుగ పురుషుడు ఎన్టీఆర్, ఆయన రూపంలో దేవుడ్ని చూశాం - సీఎం చంద్రబాబు
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh: సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !