By: ABP Desam | Updated at : 16 May 2023 03:54 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Pixel )
Stock Market Closing 16 May 2023:
స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందాయి. ఉదయం గ్యాప్ అప్‌లో మొదలైనా కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 112 పాయింట్లు తగ్గి 18,286 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 413 పాయింట్లు తగ్గి 61,932 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 9 పైసలు బలపడి 82.21 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,345 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,474 వద్ద మొదలైంది. 61,847 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,475 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 413 పాయింట్ల నష్టంతో 61,932 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
సోమవారం 18,398 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,432 వద్ద ఓపెనైంది. 18,264 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,432 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 112 పాయింట్లు పెరిగి 18,286 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ నష్టపోయింది. ఉదయం 43,903 వద్ద మొదలైంది. 43,815 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,144 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 168 పాయింట్లు తగ్గి 43,903 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 33 నష్టాల్లో ఉన్నాయి. బీపీసీఎల్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టీపీసీ షేర్లు లాభపడ్డాయి. కొటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, అపోలో హాస్పిటల్స్, మారుతీ సుజుకీ నష్టపోయాయి. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, కన్జూమర్ డ్యురబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, మీడియా, ప్రైవేటు బ్యాంకు, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ పతనమయ్యాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 పెరిగి రూ.61,910గా ఉంది. కిలో వెండి రూ.300 పెరిగి రూ.75,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.310 పెరిగి రూ.28,140 వద్ద ఉంది.
Also Read: బ్యాడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నా క్రెడిట్ కార్డ్ పొందడం పక్కా, ఈ చిట్కా ఫాలో అవ్వండి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
NSE's flagship report - NSE Market Pulse - May 2023 edition is out. Check out the key highlights from the report and for more details visit https://t.co/6uZuNqL6WI#stockmarket #investing #investment #Nifty50 #GDP #Inflation #FII #DII #RetailInvestor #Investor #MSCI #Equity… pic.twitter.com/Gduo83Q76J
— NSE India (@NSEIndia) May 16, 2023
Don't fall for unsolicited stock tips promising assured/guaranteed returns in stock market. Be a smart investor and always do your own research before investing https://t.co/6EIJrMfdyF
— NSE India (@NSEIndia) May 16, 2023
#unsolicitedstocktips #AssuredReturns #InvestorAwareness #NSEIndia @ashishchauhan pic.twitter.com/jWEQvYch2Y
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Redmi A4 5G: రూ.9 వేలలోపే 5జీ ఫోన్! - రెడ్‌మీ ఏ4 5జీ లాంచ్‌కు రెడీ - ఎప్పుడు వస్తుందంటే?
KTR: 'రూ.లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకు కేసు పెడతారా?' - జైల్లో పెడితే యోగా చేస్తానంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bajaj Freedom 125: ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ - సేల్స్‌లో దూసుకుపోతున్న బజాజ్ ఫ్రీడమ్ 125!