By: ABP Desam, Rama Krishna Paladi | Updated at : 13 Apr 2023 03:59 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్ ( Image Source : Twitter )
Stock Market Closing 13 April 2023:
స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. నష్టాల నుంచి రికవరీ అయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందాయి. మార్కెట్ అంచనాల మేరకు కంపెనీలు ఫలితాలు విడుదలు చేయకపోవడంతో ఐటీ సూచి కుంగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 15 పాయింట్లు పెరిగి 17,828 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 38 పాయింట్లు ఎగిసి 60,431 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 13 పైసలు బలపడి 81.82 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 60,392 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,364 వద్ద మొదలైంది. 60,081 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,486 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 38 పాయింట్ల లాభంతో 60,431 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
బుధవారం 17,812 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 17,807 వద్ద ఓపెనైంది. 17,729 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,842 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 15 పాయింట్లు పెరిగి 17,828 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 41,680 వద్ద మొదలైంది. 41,502 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 42,196 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రానికి 574 పాయింట్లు పెరిగి 42,132 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 29 కంపెనీలు లాభాల్లో 20 నష్టాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐచర్ మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, పవర్ గ్రిడ్ షేర్లు లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, ఇన్ఫీ, హెచ్‌సీఎల్ టెక్, ఎన్టీపీసీ, టీసీఎస్ షేర్లు నష్టపోయాయి. ఐటీ, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.110 తగ్గి రూ.61,200గా ఉంది. కిలో వెండి రూ.650 పెరిగి రూ.78,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.470 పెరిగి రూ.26,860 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి