By: ABP Desam | Updated at : 05 Jun 2023 03:45 PM (IST)
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 05 June 2023:
స్టాక్ మార్కెట్లు సోమవారం లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందాయి. ఉదయం నుంచీ సూచీలు పైపైకి ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 59 పాయింట్లు పెరిగి 18,593 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 240 పాయింట్లు ఎగిసి 62,787 వద్ద క్లోజయ్యాయి. పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆటో షేర్లు జోరుగా ట్రేడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 30 పైసలు బలహీనపడి 82.67 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 62,547 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 62,759 వద్ద మొదలైంది. 62,751 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,943 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 240 పాయింట్ల లాభంతో 62,787 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
శుక్రవారం 18,534 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సోమవారం 18,612 వద్ద ఓపెనైంది. 18,582 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,640 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 59 పాయింట్లు పెరిగి 18,593 వద్ద క్లోజైంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ లాభపడింది. ఉదయం 43,103 వద్ద మొదలైంది. 44,074 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,266 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. సాయంత్రం 163 పాయింట్లు ఎగిసి 44,101 వద్ద క్లోజైంది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్‌టీ, గ్రాసిమ్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్, హీరో మోటో, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్, హెల్త్‌కేర్ సూచీలు ఎక్కువ ఎరుపెక్కాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్‌కేర్, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి.
బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)
నేడు విలువైన లోహాల ధరల్లో మార్పులేదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,330గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.26,670 వద్ద ఉంది.
Also Read: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది
Congratulations Proventus Agrocom Limited on getting listed on NSE Emerge today! The Company is an integrated health food brand with presence in entire range of dry fruits, nuts, seeds and berries and healthy snacking products across the value chain. Public Issue was of Rs.… pic.twitter.com/vzGEqRnuWb
— NSE India (@NSEIndia) June 5, 2023
Congratulations Westlife Foodworld Limited on getting listed on the Exchange today! Westlife owned and operated 326 restaurants and 262 McCafes across the Southern and Western states of Goa, Tamil Nadu, Karnataka, Andhra Pradesh, Telangana, Gujarat, Maharashtra, Madhya Pradesh… pic.twitter.com/tbD39FSNNI
— NSE India (@NSEIndia) June 5, 2023
The #NSEBell has rung in the celebration of the listing ceremony of Westlife Foodworld Limited on the Exchange today! #NSE #Listing #IPO #NSEIndia #StockMarket #ShareMarket #WestlifeFoodworld @ashishchauhan pic.twitter.com/stGnTf2Qlq
— NSE India (@NSEIndia) June 5, 2023
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Allu Arjun Police Enquiry: అల్లు అర్జున్‌ను పోలీసు మార్క్ ప్రశ్నలతో ఇరికించేశారా ? 3 గంటల పాటు చిక్కడపల్లి పీఎస్‌లో ఏం జరిగిందంటే ?
Adilabad News: అమిత్ షా వ్యాఖ్యలు హేయమైనవి, మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలి: గిరిజన కార్పోరేషన్ చైర్మన్
Cryptocurrency: 2025లో ఇండియాలో క్రిప్టోకు మహర్దశ - నిపుణులు చెప్పే రీజన్స్ ఇవే
Youtuber Beast: వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!