By: ABP Desam | Updated at : 03 Feb 2023 04:05 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Closing 03 February 2023:
స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా లాభపడ్డాయి. గోల్డ్‌మన్ సాచెస్, జేపీ మోర్గాన్, ఫిచ్‌రేటింగ్స్‌తో అదానీ గ్రూప్ షేర్లు బలంగా పుంజుకున్నాయి. పాజిటివ్ సెంటిమెంటుతో మదుపర్లు విపరీతంగా కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 243 పాయింట్ల లాభంతో 17,854 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 909 పాయింట్ల లాభంతో 60,841 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 34 పైసలు బలపడి 81.83 వద్ద స్థిరపడింది.
BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)
క్రితం సెషన్లో 59,932 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,350 వద్ద మొదలైంది. 60,013 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,905 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 909 పాయింట్ల లాభంతో 60,841 వద్ద ముగిసింది.
NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)
గురువారం 17,610 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,721 వద్ద ఓపెనైంది. 17,584 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,870 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 243 పాయింట్ల లాభంతో 17,854 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)
నిఫ్టీ బ్యాంక్ భారీగా లాభపడింది. ఉదయం 41,019 వద్ద మొదలైంది. 40,609 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,019 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 830 పాయింట్లు పెరిగి 41,449 వద్ద ముగిసింది.
Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)
నిఫ్టీ 50లో 36 కంపెనీలు లాభాల్లో 14 నష్టాల్లో ముగిశాయి. టైటాన్ (Titan), అదానీ పోర్ట్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, హిందాల్కో, షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, పీఎస్‌యూ బ్యాంక్, ప్రైవేటు బ్యాంకు, కన్జూమర్ డ్యురబుల్స్ సూచీలు ఎగిశాయి. మీడియా, మెటల్, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Also Read: ఒక్కసారిగా క్రిప్టో మార్కెట్ల పతనం - భారీగా పడ్డ బిట్‌కాయిన్!
Also Read: స్టాక్ మార్కెట్‌లో మార్మోగుతున్న 3C మంత్రం, ఇప్పుడిదే ట్రెండ్
Also Read: జీవదానం చేసిన ఫిచ్ రేటింగ్స్ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!
Mutual Funds SIP: 'సిప్'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్ ఫండ్స్‌ను కొనొచ్చు!
Investing In SIP: ప్రతి నెలా రూ.1000 SIP చేస్తే మీరు ఎన్ని సంవత్సరాల్లో రూ.కోటి సంపాదిస్తారు?
Trisha: త్రిష ఇంట విషాదం... క్రిస్మస్ రోజు కుమారుడిని కోల్పోయానంటూ హీరోయిన్ ఎమోషనల్
Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్-10 మ్యూచువల్ ఫండ్స్
Disqualification on Jagan: లీవ్ లెటర్ ఇస్తే జగన్‌పై అనర్హతా వేటు లేనట్లే - స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Monalisa Viral Video: మోసం బాసూ... మోనాలీసా కాదు.
Delhi BJP CM Parvesh Verma: జెయింట్ కిల్లర్‌కే ఢిల్లీ సీఎం పదవి- పర్వేశ్ వర్మ పేరు దాదాపు ఖరారు!
Andhra Pradesh Liquor Rates:ఏపీలో పెరిగిన మద్యం ధరలు- రూ. 10 పెంచిన ఎక్సైజ్ శాఖ