search
×

SRF Limited Shares: జులై కనిష్టం నుంచి 30% పెరిగిన SRF - ఇక్కడైనా కొనొచ్చా లేక అమ్మాలా?

గత ఆరు నెలల్లో 11.14% లేదా రూ.261.15 జూమ్‌ అయింది. జులైలోని దాదాపు రూ.2,050 కనిష్ట-స్థాయి నుంచి ఇప్పటివరకు SRF షేర్లు 30 శాతం పెరిగాయి.

FOLLOW US: 

 SRF Limited Shares: కెమికల్స్ మేకర్ ఎస్‌ఆర్‌ఎఫ్‌ (SRF) షేరు ధర శుక్రవారం మార్కెట్‌లో 2.30% లేదా రూ.61.45 పడిపోయి, రూ.2,604.90 వద్ద సెటిలైంది.

గత నెల రోజుల్లో ఈ స్క్రిప్‌ 6.31% లేదా రూ.154.50 పెరిగింది. ముఖ్యంగా... ఆగస్టు 25 - సెప్టెంబర్‌ 1 మధ్యకాలంలో 12% పైగా లేదా రూ.295 లాభపడింది.

గత ఆరు నెలల్లో 11.14% లేదా రూ.261.15 జూమ్‌ అయింది. జులైలోని దాదాపు రూ.2,050 కనిష్ట-స్థాయి నుంచి ఇప్పటివరకు SRF షేర్లు 30 శాతం పెరిగాయి. 

వ్యాపారం, ఆర్థికాంశాలు
ఇండస్ట్రియల్‌, స్పెషాలిటీ ఇంటర్మీడియట్స్‌ తయారీ వ్యాపారాన్ని SRF చేస్తోంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌, రసాయనాలు (ఫ్లోరోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్), ప్యాకేజింగ్ ఫిల్మ్‌లు ఉన్నాయి. ఈ సంస్థకు మన దేశంలో 11 తయారీ ప్లాంట్లు ఉన్నాయి. థాయ్‌లాండ్‌లో రెండు, దక్షిణాఫ్రికాలో ఒకటి ఉండగా, హంగేరిలో ఒక ఫెసిలిటీని నిర్మిస్తోంది. 

తన ఉత్పత్తులను 75 పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది.

ఉత్పత్తి సామర్థ్యం పెంపు కోసం రూ.15,000 కోట్ల విలువైన క్యాపెక్స్ ప్లాన్స్‌ అమలు చేస్తోంది. రసాయనాల వ్యాపారంలో 20 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. దీని మూలధనంపై రాబడి (RoCE) 20 శాతంగా ఉంది, ఇది చాలా ఆరోగ్యకరమైన సంఖ్య.

కెమికల్స్‌ వెర్టికల్‌ కోసం రూ.12,000 - 13,000 కోట్లు, ప్యాకేజింగ్ ఫిల్మ్‌ల కోసం మరో రూ.2,000 కోట్లను వచ్చే 5 సంవత్సరాల్లో ఖర్చు చేయాలని SRF ప్రణాళికలు వేసుకుంది. 

ఈ స్థాయిలో కొనొచ్చా లేక అమ్మాలా?
ఈ స్క్రిప్‌ని ట్రాక్‌ చేస్తున్న విశ్లేషకుల్లో ఎక్కువ మంది బయ్‌ రేటింగ్‌, రూ.3,085 పైగా టార్గెట్లు ఇచ్చారు. ఈ టార్గెట్లు, శుక్రవారం ముగింపు కంటే 17% వరకు అప్‌సైడ్‌ను సూచిస్తున్నాయి. అంటే, ఈ స్టాక్‌ ఇక్కడ్నుంచి మరో 17 శాతం పెరగొచ్చన్నది ఎనలిస్టుల లెక్క.

కెమికల్స్ సెక్టార్‌పై కవరేజీని ప్రారంభించిన ఎలారా క్యాపిటల్ ‍(Elara Capital‌), ఈ రంగంలో ఐదు కంపెనీలను ఎంచుకుంది. వాటిలో SRF ఒకటి. ఈ కంపెనీ, FY22-25E కాలంలో, సగటున 26 శాతం ఎబిటా మార్జిన్‌తో 20 శాతం CAGR వద్ద ఆదాయ వృద్ధిని పోస్ట్ చేయవచ్చని బ్రోకరేజీ అంచనా వేసింది. 

ఫార్మాస్యూటికల్స్‌, ఆగ్రో కెమికల్స్‌ కోసం బలమైన డిమాండ్‌తోపాటు, సప్లై కాంట్రాక్టులు చైనా నుంచి భారత్‌ వైపు మారడం వల్ల మన దేశ రసాయనాల రంగం పట్ల ఎలారా క్యాపిటల్‌ సానుకూలంగా ఉంది. SRFకు రూ.3,085 ప్రైస్‌ టార్గెట్‌ ఇచ్చింది.

జేఎం ఫైనాన్షియల్ (JM Financial) మాటల ప్రకారం చూస్తే, RoCEని తగ్గించే ప్రాజెక్టులను చేపట్టేందుకు SRF ఆసక్తి చూపడం లేదు. వచ్చే 2-5 సంవత్సరాల్లో వివిధ హెచ్‌ఎఫ్‌వోల (HFO) పేటెంట్ల గడువు ముగియగానే, SRF కూడా హెచ్‌ఎఫ్‌వో స్పేస్‌లోకి అడుగు పెట్టడానికి ఆసక్తిగా ఉంది. జేఎం ఫైనాన్షియల్ ఈ స్టాక్‌కు రూ.3,000 లక్ష్యాన్ని ఇచ్చింది.

స్పెషాలిటీ కెమికల్ బిజినెస్‌లోని సరైన విభాగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల SRF ఆదాయాల నాణ్యత మెరుగుపడుతుందని, సైక్లికల్ ప్యాకేజింగ్ ఫిల్మ్ మార్జిన్‌ల నుంచి రక్షణ ఉంటుందని బ్రోకరేజ్‌ షేర్‌ఖాన్ (Sharekhan) చెబుతోంది. SRF మీద బయ్‌ రేటింగ్‌ కంటిన్యూ చేసిన షేర్‌ఖాన్‌, టార్గెట్‌ను రూ.2,960కి సవరించింది. 

ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ‍(ICICI Securities)‌, SRF మీద ఆదాయ అంచనాలను కొనసాగించినప్పటికీ, రేటింగ్‌ను 'యాడ్‌' నుంచి 'హోల్డ్'కు తగ్గించింది. రూ.2,460 టార్గెట్‌ను సూచించింది. ప్రస్తుత మార్కెట్‌ ధర కంటే ఇది తక్కువ కావడం గమనార్హం.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే!. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 03 Sep 2022 11:24 AM (IST) Tags: buy SRF SRF share price SRF news

సంబంధిత కథనాలు

Stock Market News: ఆర్‌బీఐ రేట్‌ హైక్‌తో రికార్డ్‌ స్థాయికి పెరిగిన 8 స్టాక్స్‌

Stock Market News: ఆర్‌బీఐ రేట్‌ హైక్‌తో రికార్డ్‌ స్థాయికి పెరిగిన 8 స్టాక్స్‌

Infosys Buyback: Q2 ఫలితాలతోపాటు షేర్ల బైబ్యాక్‌ కూడా, డబుల్‌ బొనాంజా

Infosys Buyback: Q2 ఫలితాలతోపాటు షేర్ల బైబ్యాక్‌ కూడా, డబుల్‌ బొనాంజా

Stocks to watch 30 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ కంపెనీలు అల్లాడిస్తున్నాయ్‌!

Stocks to watch 30 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - అదానీ కంపెనీలు అల్లాడిస్తున్నాయ్‌!

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Aarti Industries Share: ఏడాదిలో 30% డౌన్‌ - ఆర్తి ఇండస్ట్రీస్‌ను అమ్మేసే టైమొచ్చిందా?

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

Stocks to watch 29 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - Voda Ideaతో జాగ్రత్త బాస్‌!

టాప్ స్టోరీస్

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

Garuda Vahana Seva : గరుడవాహనంపై విహరించిన శ్రీవారు, జనసంద్రమైన తిరుమాడవీధులు

VIjay CID : చింతకాయల విజయ్ ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

VIjay CID :  చింతకాయల విజయ్  ఇంటికి సీఐడీ - మహిళలు, చిన్నపిల్లలతో అనుచితంగా ప్రవర్తించారని టీడీపీ ఆగ్రహం !

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Munugode Bypoll : నవంబర్ లో మునుగోడు ఉపఎన్నిక, ఇంకా 40 రోజులే ఉన్నాయ్- సునీల్ బన్సల్

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?

Bigg Boss 6 Telugu: ఓటింగ్ లో వెనుకబడ్డ ఆరోహి - ఎలిమినేషన్ తప్పదా?