search
×

Sensex Today: రెడ్‌ జోన్లోనే సూచీలు! 250 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌

Stock Market Opening 10 August 2023: స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్‌ప్లేషన్‌ డేటా భయపెడుతోంది.

FOLLOW US: 
Share:

Stock Market Opening 10 August 2023:

స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్‌ప్లేషన్‌ డేటా భయపెడుతోంది. అమెరికాలో సెల్లింగ్‌ ప్రెజర్‌ ఆసియా మార్కెట్లపై ప్రభావం చూపిస్తోంది. మధ్యాహ్నం ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 69 పాయింట్లు తగ్గి 19,564 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 250 పాయింట్లు తగ్గి 65,745 వద్ద కొనసాగుతున్నాయి. పవర్‌, మెటల్‌ సూచీలు ఎగిశాయి. ఆర్బీఐ కామెంట్స్‌ వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 65,995 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,945 వద్ద మొదలైంది. 65,509 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 65,956 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు 250 పాయింట్ల నష్టంతో 65,745 వద్ద కొనసాగుతోంది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

బుధవారం 19,632 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,605 వద్ద ఓపెనైంది. 19,495 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 69 పాయింట్లు తగ్గి 19,564 వద్ద ట్రేడవుతోంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 44,l797 వద్ద మొదలైంది. 44,479 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 44,980 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 249 పాయింట్లు తగ్గి 44,631 వద్ద కొనసాగుతోంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 16 కంపెనీలు లాభాల్లో 34 నష్టాల్లో ఉన్నాయి. అదానీ పోర్ట్స్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎం అండ్‌ ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్, ఐటీసీ, నెస్లే ఇండియా, అపోలో హాస్పిటల్స్ షేర్లు నష్టపోయాయి. మీడియా, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ,  ఫార్మా, ప్రైవేటు బ్యాంకు, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.280 తగ్గి రూ.59,670 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి రూ.5000 తగ్గి రూ.73000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.23,670 వద్ద ఉంది.

Also Read: ముచ్చటగా మూడోసారీ ఊరట - రెపో రేట్‌ యథాతథం, EMIలపై అదనపు భారం లేదు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 10 Aug 2023 01:04 PM (IST) Tags: Nse Nifty Share Market Nifty Bank BSE Sensex Stock Market update

ఇవి కూడా చూడండి

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్‌

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Investment For Children: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

టాప్ స్టోరీస్

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?- అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

YS Viveka Case: బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు ?-  అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?

Pushpa 2 Chennai Event Date: ఏయ్ బిడ్డా... ఆ రెండు రోజులు చెన్నై, కొచ్చి నగరాలు పుష్పరాజ్ అడ్డా - అక్కడ ఈవెంట్స్ చేసేది ఎప్పుడంటే?

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

Sabarimala Special Trains: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ఇవే

Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Amaran OTT Release Date: 'అమరన్' ఓటీటీ రిలీజ్ ఈ నెలలోనే... అనుకున్న తేదీ కంటే ముందుగానే Netflixలో... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?