By: Arun Kumar Veera | Updated at : 25 Apr 2024 06:48 AM (IST)
గత పదేళ్లుగా అదరగొడుతున్న బెస్ట్ ఈక్విటీ ఫండ్స్
Best Equity Mutual Funds To Invest In 2024: మ్యూచువల్ ఫండ్స్‌లో ఈక్విటీ ఫండ్స్‌కు ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. మ్యూచువల్ ఫండ్స్ రంగంలోకి అడుగు పెట్టిన ప్రతి వ్యక్తి మొదట ఎంచుకునేది వీటినే. ఎందుకంటే.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను అర్ధం చేసుకోవడం సులభం. బెస్ట్ రిటర్న్ ఇవ్వగల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను గుర్తించగలిగితే, రెండో ఆలోచన లేకుండా ఇన్వెస్ట్ చేయవచ్చు.
ACE MF ఫెర్ఫార్మెన్స్ చార్ట్ ప్రకారం.. ఎనిమిది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలు గత మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, 10 సంవత్సరా కాలాల్లో 20% పైగా రాబడి అందించాయి. ఈ ఎనిమిది స్కీమ్స్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, SBI మ్యూచువల్ ఫండ్ నుంచి వచ్చాయి. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఐదు పథకాలు, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, SBI మ్యూచువల్ ఫండ్ నుంచి తలా ఒక స్కీమ్ ఉన్నాయి.
గత పదేళ్లుగా 20% తగ్గకుండా రిటర్న్ ఇచ్చిన ఈక్విటీ ఫండ్స్
క్వాంట్ ELSS ట్యాక్స్ సేవర్ ఫండ్
లిస్ట్‌లో ఇది టాపర్. గత మూడేళ్లు, ఐదేళ్లలో 31.08% చొప్పున, ఏడేళ్లలో 24.11%, 10 సంవత్సరాలలో 25.15% రిటర్న్ ఇచ్చింది.
క్వాంట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్
ఇది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. గత మూడేళ్లలో 32.44%, ఐదేళ్లలో 29.62%, ఏడేళ్లలో 21.65%, 10 ఏళ్లలో 22.89% లాభాలు తెచ్చిపెట్టింది.
క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్
ఈ మిడ్ క్యాప్ ఫండ్ గత మూడు సంవత్సరాల్లో 35.57%, ఐదేళ్లలో 30.34%, ఏడేళ్లలో 23.93%, 10 సంవత్సరాల్లో 20.07% రాబడి ఇచ్చింది.
క్వాంట్ యాక్టివ్ ఫండ్
ఈ మల్టీ క్యాప్ ఫండ్. గత మూడేళ్లలో 27.18%, ఐదేళ్లలో 28.25%, ఏడేళ్లలో 22.98%, 10 ఏళ్లలో 22.82% గెయిన్స్ ఆఫర్ చేసింది.
యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్
ఈ స్మాల్ క్యాప్ ఫండ్ స్కీమ్ గత మూడు సంవత్సరాల్లో 26.22%, ఐదు సంవత్సరాల్లో 25.91%, ఏడు సంవత్సరాల్లో 20.01%, దశాబ్దంలో 22.35% లాభాలు సంపాదించింది.
నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్
ఇది కూడా స్మాల్ క్యాప్ కేటగిరీలోని పెద్ద స్కీమ్. మూడేళ్లలో 35.37%, ఐదేళ్లలో 29.36%, ఏడేళ్లలో 21.78%, పదేళ్లలో 26.60% రిటర్న్స్ అందించింది.
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్
ఈ స్మాల్‌క్యాప్ ఫండ్ మూడు, ఐదు, ఏడు, పది సంవత్సరాల్లో వరుసగా 39.37%, 36.79%, 25.71%, 20.58% తిరిగి ఇచ్చింది.
SBI స్మాల్ క్యాప్ ఫండ్
ఇది కూడా స్మాల్ క్యాప్ ఫండే. గత మూడు సంవత్సరాల్లో 25.17%, ఐదు సంవత్సరాల్లో 24.41%, ఏడు సంవత్సరాల్లో 20.15%, పది సంవత్సరాలలో 25.60% లాభాలు అందించింది.
ఎప్పుడూ, మ్యూచువల్ ఫండ్స్ గత పనితీరును చూసి పెట్టుబడి నిర్ణయం తీసుకోకూడదు. గతం ఘనంగా ఉన్న ఫండ్స్ భవిష్యత్‌లో చెత్త ప్రదర్శన చేయవచ్చు. రిస్క్ ప్రొఫైల్, పెట్టుబడి కాలం, ఆర్థిక లక్ష్యం, ఫండ్ మేనేజర్ సామర్థ్యం ఆధారంగా ఒక ఫండ్‌ను ఎంచుకోవాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: మే నెల నుంచి మారే మనీ రూల్స్, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్" ఎంట్రీ - జియోకి గ్రీన్ సిగ్నల్
Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు
Investment Tips: నెలకు రూ.20 వేలతో మూడేళ్లలో రూ.12 లక్షలు - అద్భుతం చేసిన ELSS ఫండ్స్
Investment For Children: ట్రెండ్ మారింది, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద
SIP: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
YS Sharmila: ఉచిత సిలిండర్లు అని గప్పాలు, కరెంట్ ఛార్జీల పెంపుతో వాతలు - ప్రభుత్వంపై షర్మిల సెటైర్లు
EID 2025 Releases: రంజాన్ బరిలో రసవత్తరమైన పోరు - పవన్ కళ్యాణ్ VS సల్మాన్ ఖాన్ VS మోహన్ లాల్!
Telangana Half Day School: తెలంగాణలో ఒంటిపూట బడులు, సమ్మర్ కాకున్నా ఇప్పుడు ఎందుకంటే!