అన్వేషించండి

Expensive EV Cars: దేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు ఇవే - రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Most Expensive EV Cars in India: అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు ఏవో తెలుసుకోవాలనుకుంటున్నారా? రోల్స్ రాయిస్ నుంచి ఆడీ దాకా...

Expensive EV Cars in India: ప్రస్తుతం మనదేశంలో ప్రీమియం కార్ల సెగ్మెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. ఈ విభాగంలో ఈవీ కార్లు కూడా ఎంట్రీ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం మనదేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఐదు ఎలక్ట్రిక్ కార్లు ఏంటో చూద్దాం. ఈ లిస్ట్‌లో రోల్స్ రాయిస్, లోటస్, బీఎండబ్ల్యూ, బెంజ, పోర్షే వంటి కార్లు ఉన్నాయి. వాటి ధర ఏంటి? ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

రోల్స్ రాయిస్ స్పెక్టర్ (Rolls Royce Spectre)
మనదేశంలో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు రోల్స్ రాయిస్ స్పెక్టర్. దీని ధరను కంపెనీ రూ.7.5 కోట్లుగా (ఎక్స్-షోరూమ్) ఉంచింది. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ కారు కోసం 102 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 585 బీహెచ్‌పీ పవర్‌ను, 900 ఎన్ఎం మిక్స్‌డ్ అవుట్‌పుట్‌ను జనరేట్ చేయగలదు. ఇది 195 కేడబ్ల్యూ ఛార్జర్‌ను కలిగి ఉంది. ఇది కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది. ఇది కాకుండా ఆప్షనల్‌గా 50 కేడబ్ల్యూ డీసీ ఛార్జర్ కూడా ఉంది, ఇది 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవ్వడానికి 95 నిమిషాలు పడుతుంది. రోల్స్ రాయిస్ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 530 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. స్పెక్టర్ ఎలక్ట్రిక్ కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

లోటస్ ఎలెట్రే (Lotus Eletre)
బ్రిటీష్ కార్ల కంపెనీ లోటస్ ఇటీవలే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎలెట్రేను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ఎక్స్-షోరూం ధర రూ.2.55 కోట్ల నుంచి రూ.2.99 కోట్ల మధ్య ఉంది. ఎలెట్రే, ఎలెట్రే ఎస్, ఎలెట్రే ఆర్ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంది. ఇందులో 112 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 905 బీహెచ్‌పీ పవర్‌ను, 958 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఈ కారు కేవలం 20 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కానుంది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ ఎలక్ట్రిక్ కారు 490 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. లోటస్ ఎలెట్రే కేవలం 2.95 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7)
బీఎండబ్ల్యూ ఐ7 కారు కంపెనీ ఫ్లాగ్‌షిప్ 7 సిరీస్‌లో వచ్చిన ఎలక్ట్రిక్ సెడాన్. జర్మనీకి చెందిన బీఎండబ్ల్యూ లాంచ్ చేసిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ సెడాన్ ఇదే. దీని ఎక్స్ షోరూం ధర రూ.2.03 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ఉండనుంది. మనదేశంలో మూడో అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ కారు ఇదే. ఎక్స్‌డ్రైవ్60, ఎం70 ఎక్స్‌డ్రైవ్ మోడళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ కారులో 101.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. బీఎండబ్ల్యూ ఐ7 641.1 బీహెచ్‌పీ పవర్‌ను, 1015 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఈ కారు కేవలం 34 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ ఎక్కనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు 625 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇది కేవలం 3.7 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఈక్యూఎస్ (Mercedes Benz AMG EQS)
మెర్సిడెస్ బెంజ్ కంపెనీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారతదేశంలో ఈ బ్రాండ్ బాగా ఎస్టాబ్లిష్ అయింది కూడా. భారతీయ మార్కెట్‌కు మెర్సిడెస్ ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏఎంజీ ఈక్యూఎస్‌నే. భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మొదటి ఏఎంజీ కారు ఇదే. ఈ ఫుల్లీ లగ్జరీ కారు ధర రూ.2.44 కోట్లుగా (ఎక్స్ షోరూం) ఉంది. ఇందులో 107.8 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ ఈక్యూఎస్ 762 బీహెచ్‌పీ పవర్‌ను, 1020 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఈ ఎలక్ట్రిక్ కారు 580 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుంది. ఇది కేవలం 3.4 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.

పోర్షే టేకాన్ (Porsche Taycan)
లగ్జరీ కార్ల కంపెనీ పోర్షే మనదేశంలో ఇటీవల లాంచ్ చేసిన కారు ఇదే. దీని ఎక్స్ షోరూం ధర 1.61 కోట్ల నుంచి రూ.2.44 కోట్ల మధ్య ఉన్నాయి. ఈ కారు మూడు బ్యాటరీ ప్యాక్‌ల్లో అందుబాటులో ఉంది. వీటిలో 79.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్ 321.84 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేస్తుంది. 431 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను కూడా అందించనుంది. అలాగే 93.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న మోడల్లో 321.84 బీహెచ్‌పీ, 616.87 బీహెచ్‌పీ పవర్‌ను జనరేట్ చేసే మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవి రెండూ 452 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను కూడా అందించనున్నాయి.

ఇవి కాకుండా ఆడీ ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ (Audi RS E Tron GT) కూడా ఎక్కువ ధర ఉన్న లగ్జరీ కారు అని చెప్పవచ్చు. దీని ఎక్స్ షోరూం ధర రూ.1.94 కోట్లుగా ఉంది. కేవలం ఒక్క వేరియంట్లో మాత్రమే ఈ కారు అందుబాటులో ఉంది. ఇందులో 93.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని అందించారు. ఈ కారు 636 బీహెచ్‌పీ పవర్‌ను, 830 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేయగలదు. ఆడీ ఆర్ఎస్ ఈ-ట్రాన్ జీటీ 481 కిలోమీటర్ల రేంజ్‌ను అందించనుందని కంపెనీ తెలిపింది.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
Rakul Preet Singh wedding: పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
Singareni Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
Congress Candidate: లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Revanth Reddy on Gas Cylinder : ఆరు గ్యారెంటీల్లో మరో హామీ అమలు ప్రకటించిన సీఎం రేవంత్| ABP DesamRakul Preet Singh Wedding : గోవాలో గ్రాండ్ గా రకుల్ ప్రీత్ సింగ్ వివాహం | ABP DesamVarun Tej on Lavanya Tripathi : పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేస్తానంటున్న వరుణ్ తేజ్ | ABP DesamTDP Leaders Welcoming Vemireddy prabhakar reddy : వేమిరెడ్డిని టీడీపీలోకి ఆహ్వానిస్తున్న నేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
నేడు కాంగ్రెస్ ఛలో సెక్రటేరియట్, పార్టీ నేతల హౌస్ అరెస్టులపై షర్మిల ఫైర్
Rakul Preet Singh wedding: పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
పెళ్లి ఫొటోలు విడుదల చేసిన రకుల్‌ - ఇకపై నువ్వు నా సొంతం అంటూ భర్తపై ప్రేమ..
Singareni Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ -త్వరలోనే సింగ‌రేణిలో పోస్టుల‌కు నోటిఫికేష‌న్లు: డిప్యూటీ సీఎం భట్టి
Congress Candidate: లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
లోక్‌సభకు కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన రేవంత్‌ రెడ్డి, ఆయన ఎవరంటే!
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మార్చి నుంచి ఆ త్యాగం చేయక తప్పదు!
మహేష్ బాబు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - మార్చి నుంచి ఆ త్యాగం చేయక తప్పదు!
Chandrababu Letter To DGP: సీఎం జగన్‌పై చర్యలు తీసుకోండి- డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
సీఎం జగన్‌పై చర్యలు తీసుకోండి- డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ
BRS News: హైదరాబాద్‌లో BRS భారీ బహిరంగ సభకు ప్లాన్! ఈసారి అజెండా ఇదే!
హైదరాబాద్‌లో BRS భారీ బహిరంగ సభకు ప్లాన్! ఈసారి అజెండా ఇదే!
Hansika Motwani: పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక
పెళ్లి తర్వాత కూడా ఏం మారలేదు - అదొక్కటి తప్పా అంటున్న హన్సిక
Embed widget