News
News
X

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

Somu Veerraju: మూడు రాజధానుల పేరుతో జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకోవాలని జగన్ అనుకుంటున్నారని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శించారు.

FOLLOW US: 
 

Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రాష్ట్రంలో సమస్యలు తిష్ట వేశారని మండిపడ్డారు. ఏపీలో 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని, రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ఇసుక కొరత ఏర్పడి కార్మికులు ఉపాధి కొరవడి రోడ్డున పడ్డారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగం కార్మికులు అందరూ ఈ-శ్రామ్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. భవన నిర్మాణ రంగం కార్మికుల సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసిందని ఈ సందర్భంగా సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో బంగారం సులభంగా దొరుకుతుందని.. కానీ ఇసుక మాత్రం దొరకడం లేదని ఎద్దేవా చేశారు. 

'కేంద్రం ఇచ్చిన నిధులను ఏం చేశారు'

గతంలో కొంత మంది నాటు సారా తయారుచేసేవారని.. సీఎం జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్, శాండ్, రైస్, లిక్కర్, మైనింగ్ మాఫియాలు తయారు అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని సోమువీర్రాజు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే వారం రోజులలో గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాలనపై ప్రభుత్వానికి అవగాహన లేదని.. ప్రతి జిల్లాలో సివిల్ సప్లైస్ అధికారులు, ప్రజాప్రతినిధులు వంద కోట్ల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. నాడు-నేడు కింద 50 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చామని తెలిపారు. కేంద్ర పథకాలు క్షేత్ర స్థాయికి వెళ్లనివ్వడం లేదని ఈ సందర్భంగా సోము వీర్రాజు ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ప్రభుత్వానికి 6వేల 500 కోట్లు ఇచ్చామని చెప్పిన సోము వీర్రాజు.. ఆ నిధులను ఏం చేశారో చంద్రబాబు చెప్పాలని నిలదీశారు. 

మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని సోము వీర్రాజు మండిపడ్డారు. వైసీపీ, టీడీపీ రెండూ కుటుంబ పార్టీలేనని అన్నారు. కుటుంబ పార్టీలు అవినీతి చేస్తాయని, ప్రధాని మోదీ అభివృద్ధి చేస్తారని పేర్కొన్నారు. 

News Reels

'సంపదనంతా ఏకీకృతం చేసి దోచుకుంటున్నారు'

రాష్ట్ర సంపదనంతా ఏకీకృతం చేసి  దోచుకుంటున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడు కావాలన్నదే జగన్ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రజా పోరు యాత్ర నడుపుతున్నట్లు వెల్లడించారు. "మా సిద్ధాంతం ఉత్తరాంధ్ర అభివృద్ధి గాని,ఉత్తరాంధ్రను దోచుకోవడం కాదు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈ ప్రాంతం లో ప్రశాంతం గా ఉండాలి కోరుకుంటున్నారు. మూడున్నరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో వైసిపి ప్రభుత్వం చెప్పాలి. ఇటు వంటి సీఎం ఉండడం దురదృష్టకరం. అమరావతి యాత్రకు ఏం జరిగినా దానికి సీఎం బాధ్యత వహించాలి. అమరావతి యాత్రకి హైకోర్టు అనుమతి ఇచ్చింది. బీజేపీ పూర్తి మద్దత్తు ఇస్తోంది. పోలవరం విషయంలో  ఈ రాష్ట్రానికి చేతకాక పోతే, తప్పుకుంటే, మేమే కడతాం" అని కన్నా లక్ష్మీ నారాయణ విమర్శలు గుప్పించారు. 

'మోదీ ప్రభుత్వం రావాల్సిందే'

రాష్ట్ర సంపదను ఏకి కృతం చేసి దోచుకున్న వ్యక్తి ఈ ముఖ్య మంత్రి జగన్ అని కన్నా విమర్శించారు. "8 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఆర్టీసీ చార్జీ పెంచారు.  చివరికి చెత్త పన్ను వేశారు. ప్రభుత్వమే లిక్కర్ అమ్మడం వల్ల ఈ లిక్కర్ ధరలతో డ్రగ్స్ కు బానిస అవుతున్నారు. కరోనా సమయంలో శానిటైజర్ తాగి చనిపోయారు. ఇప్పటికి కల్తీ మద్యం తాగి చనిపోతున్నారు. మళ్ళీ 2024 నరేంద్ర మోదీ పాలనా వస్తే గాని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదు. అప్పుడే డబల్ ఇంజిన్ అభివృద్ధి సాధ్యం అవుతుంది" అంటూ కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Published at : 27 Sep 2022 03:33 PM (IST) Tags: AP News AP Politics AP BJP Somu veerraju comments Somu Veerraju Fires on CM Jagan

సంబంధిత కథనాలు

Vijayawada News : విజయవాడలో 5 పైసలకే ఫుల్ మీల్స్, ఎగబడ్డ జనం- చివర్లో ట్విస్ట్!

Vijayawada News : విజయవాడలో 5 పైసలకే ఫుల్ మీల్స్, ఎగబడ్డ జనం- చివర్లో ట్విస్ట్!

Vijayawada: మహిళా ఆర్ఎంపీ డాక్టర్ గలీజు పని! రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన పోలీసులు

Vijayawada: మహిళా ఆర్ఎంపీ డాక్టర్ గలీజు పని! రెడ్‌హ్యాండెడ్‌గా పట్టేసిన పోలీసులు

Perni Nani: చంద్రబాబుకు వెంకటేశ్వరస్వామి శాపం, ఆయన్ని చంపాల్సిన అవసరం మాకేంటి? - పేర్ని నాని వ్యాఖ్యలు

Perni Nani: చంద్రబాబుకు వెంకటేశ్వరస్వామి శాపం, ఆయన్ని చంపాల్సిన అవసరం మాకేంటి? - పేర్ని నాని వ్యాఖ్యలు

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

ప్రజలను సెంటిమెంట్‌తో కొడుతున్న పార్టీలు- ఇది వర్క్ అవుట్ అవుతుందా?

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

టాప్ స్టోరీస్

Amararaja Telangana : తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Amararaja Telangana :  తెలంగాణకు మరో భారీ పెట్టుబడి - రూ. 9,500 కోట్లతో అమరరాజా బ్యాటరీ పరిశ్రమ !

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Tirupati Crime : ఏపీలో మరో పరువు హత్య?- చంద్రగిరి యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్!

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Indian Festivals Calendar 2023: 2023 లో ముఖ్యమైన రోజులు, పండుగలు ఇవే

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !

Bandi Sanjay : బీజేపీ డబుల్ సంక్షేమం - పాత పథకాలేమీ ఆపేది లేదని బండి సంజయ్ హామీ !