Top 5 Telugu Headlines Today 10 June 2023:
ఏపీలో పవన్ వ్యాఖ్యల దుమారం- వాలంటీర్ల ఫిర్యాదుతో మహిళా కమిషన్ నోటీసులు
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారుతున్నాయి. వాలంటీర్ల ఫిర్యాదుతో మహిళా కమిషన్ పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. జనసేనాని వ్యాఖ్యలపై అధికార పార్టీ నాయకులు ఇప్పటికే అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లు కూడా ఆయనపై మండిపడుతున్నారు. పవన్ తాను చేసిన వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలన్నారు మహిళా కమిషనర్ వాసిరెడ్డి పద్మ. అలా చేయకుంటే కనీసం క్షమాపణ అయినా చెప్పాలని డిమాండ్ చేశారు. రెండూ చేయకుంటే మాత్రం మహిళా కమిషన్ పవన్ కల్యాణ్‌ను వెంటాడుతుందని వార్నింగ్ ఇచ్చారు. పూర్తి వివరాలు
ఈటలతో పాటు ధర్మపురి అర్వింద్‌కు కూడా కేంద్ర సెక్యూరిటీ - ముప్పు ఉందని కేంద్రానికి సమాచారం ఉందా ?
ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో పాటు ఎంపీ ధర్మపురి అరవింద్ లకు కేంద్ర బలగాలు భద్రత కల్పించనున్నాయి. ఇద్దరు నేతలుcrpf భద్రత పరిధిలోకి వెళ్లనున్నారు. ఈటలకు వై ప్లస్, అర్వింద్ కు వై సెక్యూరిటీ, ఇద్దరికీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించనున్నారు. ఇద్దరి నాయకుల ఇళ్లకు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వెళ్లి.. పరిశీలించనున్నారు. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తో పాటు 11 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు సెక్యూరిటీ కల్పించనున్నారు. ఇక అర్వింద్ కు 8 మందితో కూడిన సీఆర్పీఎఫ్ బలగాలు రక్షణ కల్పించనున్నాయి. పూర్తి వివరాలు
హైదరాబాద్‌లో ఎంజాయ్ స్టార్- ఏపీలో గంజాయ్ స్టార్- పవన్ అంటే ఆడపిల్లలు భయపడుతున్నారు
వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు మంత్రి అమర్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఆడపిల్లలు పవన్ చూసి భయపడుతున్నారని అన్నారు. ఎక్కడ రోడ్డుపై కనిపిస్తే తాళి కట్టేస్తారో అని జడుసుకుంటున్నారని అన్నారు. ఏ ముహూర్తాన ఆయనకు కల్యాణ్ అని పేరు పెట్టారో దాన్ని సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ తన కోసం ఎదగడం మానేసి చంద్రబాబు కోసం పని చేస్తున్నారని... అందుకే జగన్‌పై వైసీపీ లీడర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌తో పోల్చుకునే అర్హత కూడా పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. ఆయన 2011లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని వివరించారు. పవన్ కల్యాణ్ 2008 నుంచి ట్రై చేస్తున్నారని ఏం చేశారని ప్రశ్నించారు. పూర్తి వివరాలు
తెలంగాణలో విభేదాలపై బీజేపీ ఫోకస్- పార్టీ లైన్ దాటొద్దని నడ్డా స్వీట్ వార్నింగ్- అసంతృప్తులతో ఈటల మీటింగ్
అధ్యక్షుడి మార్పుతో తెలంగాణ బీజేపీలో ఏర్పడిన గ్యాప్స్‌ను పూడ్చే పనిలో అధినాయకత్వం ఉంది. ఏకంగా జాతీయ అధ్యక్షుడు నడ్డా నేతలకు క్లాస్ తీసుకున్నారు. పార్టీ లైన్ దాటి మాట్లాడిన వారిపై సీరియస్‌గా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తెలంగాణలో ఆదివారం పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ నేతలకు క్లాస్ తీసుకున్నారు. పదకొండు రాష్ట్రాల పార్టీ అధ్యక్షులతో సమావేశం అనంతరం తెలంగాణ నేతలతో మాట్లాడారు. కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత జరిగిన ఈ తొలి భేటీ చాలా హాట్‌హాట్‌గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు బీఎల్ సంతోష్, ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, ఈటలరాజేందర్, బండి సంజయ్, లక్ష్మణ్, వివేక్, డీకే అరుణ, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నారు. పూర్తి వివరాలు
వాలంటీర్లతో విమెన్ ట్రాఫికింగ్- ఏలూరులో పవన్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టారు. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న ఈ టైమ్‌లో చిన్నపాటి గ్యాప్ ఇచ్చి వారాహి విజయ యాత్ర రెండో దశ ప్రారంభించిన పవన్..ఈసారి నేరుగా వైసీపీని, ఆ పార్టీ బలాలను టార్గెట్ చేశారు. ఏలూరులో జరిగిన వారాహి విజయ యాత్రలో సీఎం జగన్‌పై కౌంటర్లు విసరటమే కాదు ఏపీలో వైసీపీ ప్రధాన బలంగా చెప్పుకునే వాలంటీర్ల వ్యవస్థ మీద సంచలన వ్యాఖ్యలే చేశారు. ముందుగా సీఎం జగన్‌ను ఇన్నాళ్లు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి గారూ అంటూ వచ్చిన పవన్..ఇకపై ఆ గౌరవం ఇవ్వబోనని కామెంట్స్ చేశారు. అసలు ముఖ్యమంత్రి పదవికే జగన్ అనర్హుడని స్టేట్‌మెంట్ ఇచ్చారు. పూర్తి వివరాలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial