వాలంటీర్లు విమెన్ ట్రాఫికింగ్‌కు పాల్పాడుతున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌కు మంత్రి అమర్‌నాథ్‌ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఏపీలో ఆడపిల్లలు పవన్ చూసి భయపడుతున్నారని అన్నారు. ఎక్కడ రోడ్డుపై కనిపిస్తే తాళి కట్టేస్తారో అని జడుసుకుంటున్నారని అన్నారు. ఏ ముహూర్తాన ఆయనకు కల్యాణ్ అని పేరు పెట్టారో దాన్ని సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 


పవన్ కల్యాణ్ తన కోసం ఎదగడం మానేసి చంద్రబాబు కోసం పని చేస్తున్నారని... అందుకే జగన్‌పై వైసీపీ లీడర్లపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌తో పోల్చుకునే అర్హత కూడా పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. ఆయన 2011లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారని వివరించారు. పవన్ కల్యాణ్ 2008 నుంచి ట్రై చేస్తున్నారని ఏం చేశారని ప్రశ్నించారు. 


ఉన్మాదిలా మట్లాడుతున్నారు


తిరుగుబోతు సంసారం, కాపురాల గురించి మాట్లాడితే  ఎలా ఉంటుందో పవన్ కల్యాణ్ రాజకీయల గురించి మాట్లాడితే అలా ఉంటుందన్నారు అమర్‌. తీవ్ర నిరాశతో మాట్లాడిన మాటలుగా ఉన్నాయన్నారు. రాజకీయంగా ఎదుగుదల లేదు, ఎమ్మెల్యేను కాలేను. ఎవరూ ఓట్లు వేయరు, రాజకీయాలకు పనికిరాను అని అనుకుంటున్నారన్న ఆవేదనతో చేసిన వ్యాఖ్యలుగా చూడాలన్నారు. అందుకే ఉన్మాది మాట్లాడిన మాట్లాడుతున్నారని విమర్శించారు. 


ఏం చేస్తారో చెప్పుకోలేకపోతున్నారు 


ఒక రాజకీయ పార్టీని నడిపే అధ్యక్షుడు మాట్లాడాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు అమర్‌. 9 నెలల్లో రానున్న ఎన్నికల కోసం పార్టీ రెడీ అవుతున్నాయి, అధికారంలోకి రావడానికి ఏం చేయాలో, ఎలా ప్రజలను మెప్పించాలో మానేసి ఈ దూషణలేంటని నిలదీశారు. ఓ రాజకీయా పార్టీని స్థాపించి ప్రజల్లోకి వచ్చినప్పుడు అధికారంలోకి ఏం చేయబోతున్నారు, ఏ సందర్భంలో పార్టీ పెట్టారు అని చెప్పాలన్నారు. 2024లో అవకాశం ఇస్తే ఏ పనులు చేస్తారో చెప్పుకోవాలని సూచించారు. అవి మానేసి నిత్యం జగన్‌ను, ప్రభుత్వాన్ని నిందిస్తూ నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్మాదిలా ప్రవరిస్తూ, హావభావాలను ప్రదర్శిస్తూ మాట్లాడిన మాటలను వైసీపీయే కాదు ప్రజలు కూడా ఖండించాలన్నారు. సహజంగా ఆయన మాటలు సైకో ఫ్యాన్స్‌కో నచ్చవచ్చని అన్నారు. నిజం లేకుండా కేవలం విమర్శిస్తే రాజకీయంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశం మాట్లాడినట్టు కనిపిస్తోందన్నారు. 


చెప్పులు చూపించాల్సి ఉంటుంది


చెప్పులు ఎత్తి చూపించడం పవన్‌కు అలవాటుగా మారిందని... ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలకు ప్రజలే చెప్పులు చూపిస్తారన్నారు అమర్. మాటలు సరిగా మాట్లాడకుంటే, పద్దతి మార్చుకుంటే, రాష్ట్ర ప్రజలు తిరగబడే స్థాయికి పవన్ వచ్చినట్టు కనిపిస్తోందన్నారు. ఏలూరులో చెప్పినవి కాగ్‌ లెక్కలో చంద్రబాబు ఇచ్చిన కాగితపు లెక్కలో ఆవేశంలో చెప్పిన కాకిలెక్కలో ప్రజలు గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు. రిపోర్ట్‌ గురించి చెప్పినప్పుడు అది ఏ సంస్థ ఇచ్చిందో కూడా స్పష్టంగా వివరించాలన్నారు. ఏదో ఎన్‌సీబీ రిపోర్టు అన్నారని రాత్రంతా గూగుల్ చేసినా దొరకలేదని తెలిపారు. స్నేహితులను అడిగితే అది ఎన్సీబీ కాదు ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్ అని చెప్పారన్నారు. కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. 


ఎప్పుడు గౌరవించావు


జగన్‌ను ఇకపై గౌరవించడం లేదన్న పవన్ కల్యాణ్‌... అసలు ఎప్పుడు గౌరవించారన అమర్ ప్రశ్నించారు. ఒక్క చంద్రబాబుకు తప్ప వేరే వారిని పవన్ గౌరవించరని విమర్శించారు. జగన్ రెడ్డి అన్నప్పుడు గౌరవించావా? ఏక వచనంతో మాట్లాడిన సందర్భాలు మర్చిపోయావా? ఇలా మాట్లాడితే 2024లో ఏమైపోతావో తెలుసుకాదా అంటూ వార్నింగ్ ఇచ్చారు. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందుకు వచ్చిన తొడకొట్టినట్టు అయిపోతావని హెచ్చరించారు. 


జగన్‌తో పోలీక ఏంటీ?


జగన్‌కు పవన్‌కు పోలిక ఏంటీ, 2011లో పార్టీ పెట్టి ప్రజల కోసం పోరాటాలు చేసి 2019లో ఘనవిజయం సాధించారన్నారు. 2008 నుంచి ట్రై చేస్తున్నా ఒక్క సీటు గెలవలేని పరిస్థితి పవన్ది అని ఎద్దేవా చేశారు సినిమాల్లో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్‌లు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారని... పవర్ స్టార్ అని చెప్పుకునే ఎందుకు కాలేకపోయారని ప్రశ్నించారు. హావభావాలు, నిలకడ తనం లేకపోవడం, మాటలు, ఆలోచనలు సిద్ధాంతాలు లేని పార్టీ వల్ల ఈ దుస్థితి అన్నారు. 


హైదరాబాద్‌లో ఎంజాయ్‌ స్టార్- ఏపీలో గంజాయి స్టార్


ఎప్పుడో అవసరం ఉన్నప్పుడు గుర్తుకు వచ్చే తల్లి, ఏదో ప్రజల్లో సెంటిమెంట్ పండించడానికి భార్యను అవసరం మేరకు తీసుకొచ్చి ఉపయోగించుకుంటావన్నారు. నీ తల్లినీ, భార్యను వైసీపీ ఎప్పుడైనా పల్లెత్తు మాట అన్నాదా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలు తన తల్లిని అగౌరవపరిచారని పవనే చెప్పారని గుర్తు చేశారు. ఓడించారని ప్రజలపై చూపించాల్సిన కోపం, నీ ఫ్యాన్స్ ఓట్లు జగన్‌కు పడుతున్నాయని బాధ పవన్‌లో కనిపిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఎంజాయ్‌ స్టార్‌, ఏపీలో గంజాయ్‌ స్టార్ అని కామెంట్స్ చేశారు. అక్కడ నుంచి తెచ్చుకోవడం ఇక్కడ వేయడం నోటుకు వచ్చింది మాట్లాడుతున్నారని విమర్శించారు. 


పవన్‌ అంటే ఆడపిల్లలు భయపడుతున్నారు


వాలంటీర్ వ్యవస్థ గురించి కేంద్రం, ప్రధాని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయని అమర్ గుర్తు చేశారు. అంతర్జాతీయ సంస్థలు ప్రస్తావించాయన్నారు. కోవిడ్‌ సందర్భంగా వాలంటీర్‌ వ్యవస్థ దేశానికే ఉదాహరణగా నిలచిందన్నారు. అలాంటి వాలంటీర్లపై ఏ మాట్లాడుతున్నారని నిలదీశారు. పవన్‌ తనకు ఉన్న ఆలోచనలు వాలంటీర్లపై రుద్దితే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆడపిల్లలు పవన్‌కే భయపడాలి అన్నారు. రోడ్డుపై కనిపిస్తే ఎక్కడ తాళి కట్టేస్తారో అని భయపడి తిరుగుతున్నారని ఆరోపించారు. ఏ ముహూర్తాన కల్యాణ్ అని పేరు పెట్టారో ఆ పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు. వాలంటీర్‌లు అనే వాళ్లు ఆపద వస్తే కాపాడతారన్న ధైర్యంతో రాష్ట్ర ప్రజలు జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. పేదవాలకు కష్టం వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారధిలా ఉన్నారు. 


ఒకవేళ అధికారంలో ఇస్తే వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించండి. గతంలో ప్రభుత్వం పని ఉంటే మండలానికి వెళ్లాల్సి వచ్చేది ఇప్పుడు ఇంటివద్దకే వచ్చి అధికారులు పూర్తి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. జనసేనాని అని ఫ్యాన్స్ అనుకుంటే తాను చంద్రబాబు సేనానీ అని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆ పార్టీని తీసుకెళ్లి తెలుగుదేశంలో కలిపేయాలని సూచించారు. రెండు బ్యానర్‌లు కలిపేస్తే డబ్బులు రావని పవన్ ఫీలింగ్‌ అంటూ సెటైర్లు వేశారు. 


ఒక పార్టీ నాయకుడు సీఎంను కావాలనే తపనతో పని చేస్తాడని  పవన్ మాత్రం టీడీపీ కోసం పార్టీని నడుపుతున్నారని అమర్‌ ఆక్షేపించారు. ఆ ప్యాకేజీ కోసమే పని చేస్తాన్నారని అన్నారు. వెబ్‌సిరీస్‌లా వారాహీ పార్ట్‌ 1,2 ఏంటీ అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీల కోసం ఆయన ఇచ్చిన స్క్రిప్టును మాట్లాడటం కోసం అందరినీ తిట్టడమేంటని నిలదీశారు. ఇవన్నీ మానేసి కనీసం నువ్వైనా గెలిచేందుకు ట్రై చెయ్ అని అమర్‌నాథ్ సలహా ఇచ్చారు.