ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఒప్పందాలపై అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. 9వేల మెగావాట్ల సంప్రదాయేతర విద్యుత్‌ను కేంద్ర సౌర విద్యుత్‌ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయాలని కేబినెట్‌లో ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపైనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. అసలు ప్రతిపక్షం ఆరోపణమేంటి? అధికార పక్షం వివరణలేంటి ? 


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న నిర్ణయం ఇది ! 


ఏపీలో వ్యవసాయదారులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి ప్రభుత్వం 9వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. గత నెల 28వ తేదీవ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ. 2.49 కి ఏడాదికి 17 వెల మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తేలిపింది.  ఈ విద్యుత్ ద్వారా రైతులకు రోజుకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని.. నాణ్యమైన విద్యుత్ రైతులకు అందుబాటులో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.


Also Read : జైభీమ్ లో చూపించినట్లు నన్నూ హింసించారు.... ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు


అంత ఎక్కువ రేటు పెట్టి ఎందుకు కొంటున్నారు ?


యూనిట్ రూ. 2.49 పైసలకు కొనుగోలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఈ రేటును ప్రశ్నించారు. ప్రభుత్వానికి అమ్ముతామని ప్రతిపాదన పంపిన "సెకి" 2020 నవంబరు, డిసెంబరు నెలల్లో సౌర విద్యుత్‌ ప్లాంట్‌ల ఏర్పాటుకి టెండర్లు పిలిస్తే యూనిట్‌ విద్యుత్‌ రూ.2కి, గుజరాత్‌ ప్రభుత్వం పిలిచిన టెండర్లలో యూనిట్‌ రూ.1.99కే తక్కువ ధరకు బిడ్లు దాఖలయ్యాయని పత్రాలు చూపించారు. అంత తక్కువ ధరకు ఇతర రాష్ట్రాలు బిడ్లు వేస్తే .. ఎక్కువకు కొనుగోలు చేయాలని నిర్ణయించి తక్కువ రేటు అని ఎలా చెబుతారని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. నిజానికి అది అసలు రేటు కాదని... ఎక్కడో ఉత్పత్తి చేస్తున్నందువల్ల ఆ విద్యుత్ రాష్ట్రానికి చేరే సరికి రూ. నాలుగున్నర అవుతుందని.. దీని వల్ల వచ్చే 25 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలపై రూ.1.20 లక్షల కోట్ల అదనపు భారం పడుతుందని పయ్యావుల కేశవ్ లెక్కలు చెప్పారు. 


 విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతితోనే యూనిట్‌ రూ.2.49కి సెకి నుంచి కొనుగోలు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.  విద్యుత్‌ చట్టం నిబంధనల మేరకు సెకి టెండర్లు నిర్వహించి యూనిట్‌ ధర ఖరారు చేశారు.. ఇందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని తెలిపింది. అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటైన ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్‌ తీసుకోవడం వల్ల ధర పెరుగుతుందనే ఆరోపణలను ఖండించింది. ధర  తగ్గుతుందని... ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను తీసుకుంటే కేంద్ర గ్రిడ్‌ ఛార్జీలకు మినహాయింపు ఉండటం వల్ల చౌకగా అందుతుందని వివరణ ఇచ్చింది.


Also Read : ఆయన ఆఫీసర్ కాదు .. వైఎస్ఆర్‌సీపీ ఏజెంట్ ..! మార్చాలంటూ కుప్పం ఎన్నికల అధికారిపై హైకోర్టులో టీడీపీ పిటిషన్ !


గ్రిడ్ సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది ?


తెలుగుదేశం పార్టీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోనే సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా  6600 మెగావాట్లకు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. బుద్ది ఉన్న వాడు ఎవడైనా పాతికేళ్లకు ఒప్పందాలు చేసుకుంటారా అని జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. అవినీతి జరిగిందని.. గ్రిడ్ సామర్థ్యం లేదని ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో గ్రిడ్ సామర్థ్యం ఎలా మెరుగుపడిందని ప్రశ్నించారు. 


సెకి ఒప్పందం ద్వారా అదనంగా వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయటానికి ఏపీ ట్రాన్స్‌కో, డిస్కంలు రూ.3,762 కోట్లతో నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేశాయని ప్రభుతవం తెలిపింది. గత రెండేళ్లలో కొత్తగా 20 ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లు, 162 డిస్కం సబ్‌స్టేషన్లు ఏర్పాటయ్యాయని తెలిపింది. దీని వల్ల గ్రిడ్ సమస్య రాదని తెలిపింది.


Also Read : ఆ విద్యుత్ ఒప్పందాల వెనుక రూ. లక్షా 20వేల కోట్ల స్కాం... టీడీపీ నేత పయ్యావుల తీవ్ర ఆరోపణలు !


ఏపీలో విద్యుత్ ప్లాంట్లు ఎందుకు పెట్టరు ? 


సౌర విద్యుత్‌ ప్లాంట్లు చట్ట ప్రకారం ఏపీఈఆర్‌సీ అనుమతి తీసుకుని మన రాష్ట్రంలోనే ఎందుకు పెట్టడం లేదని పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. అదానీ సంస్థ సోలార్‌ ప్యానెళ్లు గుజరాత్‌లో తయారు చేస్తామని, ప్లాంట్‌ రాజస్థాన్‌లో పెడతామని చెబుతోందన్నారు. అంటే  రూ.30 వేల కోట్లపై జీఎస్టీ గుజరాత్‌ ప్రభుత్వానికి వెళుతుందని .. రాజస్థాన్ వాసులకు ఉద్యోగాలు వస్తాయని మనకేంటి లాభమని ఆయన ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ప్లాంట్లు పెడితే రైతులకు, నిరుద్యోగులకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అంతే కాకుండా  25 ఏళ్ల తర్వాత ఆ ప్లాంట్లు ప్రభుత్వ ఆస్తిగా మారిపోతాయన్నారు.  


అయితే ఆ సౌర ప్లాంట్లను కర్నూలు, అనంతపురంలలో ఏర్పాటు చేస్తే కేంద్ర గ్రిడ్‌కు అనుసంధానించడానికి తమిళనాడు, కర్ణాటక వెళ్లిన తర్వాత అక్కడి నుంచి మనం తీసుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. అది రాష్ట్రానికి మరింత భారం అవుతుందని విశఅలేషించింది. ఉత్తరాది నుంచి దక్షిణ భారత గ్రిడ్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా అవుతున్నందున ముందుగా ఒడిశా నుంచి శ్రీకాకుళం మీదుగా దిగువన డిమాండ్‌ ఉన్న కృష్ణా, గుంటూరు ప్రాంతాలకు అందుతుందని తెలిపింది. అయితే ప్లాంట్లు పెట్టడం వల్ల ఏపీకి రావాల్సిన జీఎస్టీ ఆదాయం, ఇతర అంశాలపై ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో క్లారిటీ లేదు.


Also Read : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం... ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.. ఆలస్య హాజరు ఎక్కువైతే వేతనాల్లో కోత


గంటల్లోనే ఒప్పందాలు చేసుకుంటారా ? 


అదానీ సంస్థ సోలార్ విద్యుత్‌ను యూనిట్‌ ధరను రూ.2.49కి తగ్గించిందని.. ఒప్పందం చేసుకోవాలని సెకి సెప్టెంబరు 15న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని.. వెంటనే కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేశారని పయ్యావలు కేశవ్ ఆరోపించారు. సెప్టెంబరు 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసేసుకున్నారని ఇంత వేగంగా గంటల్లో ఎలా నిర్ణయంతీసుకుంటారని ప్రశ్నించారు. 


ప్రభుత్వం అన్ని పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ల రాష్ట్రంలో ప్రాజెక్టు ఏర్పాటు చేసే దానికంటే తక్కువ ధరకే విద్యుత్‌ అందుతుంది. అందుకే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ సెకి ప్రతిపాదనపై అపనమ్మకాన్ని కలిగించే కారణం ఏదీ ప్రభుత్వానికి కనిపించలేదని ప్రభుత్వం తెలిపింది.


Also Read:  ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?


అదానీకి కట్టబెట్టేందుకేనని ఆరోపణలు !


ప్రభుత్వం కొన్నాళ్ల కిందట ఏపీలోనే సౌరవిద్యుత్ ప్లాంట్లు పెట్టాలని నిర్ణయించింది. ఆ మేరకు భూ సేకరణ చేసింది. టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో అదానీ పవర్‌తో పాటు కడపకు చెందిన మరో సంస్థ కూడా టెండర్లు దక్కించుకుంది. అయితే ఈ టెండర్ల ప్రక్రియ అంతా లోపభూయిష్టమని టాటా పవర్ సంస్థ హైకోర్టులో పిటిషన్ వేసింది. హైకోర్టు ఆ టెండర్లను రద్దు చేసింది. ఇప్పుడు సెకి ద్వారా అదానీ పవర్‌కు చెందిన విద్యుత్‌నే కొనుగోలు చేయాడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఎలా చూసినా అదానీకి మేలు చేయడానికే ఇలా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. 


రైతులకు మేలు చేయడానికి మాత్రమే విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు వినియోగించుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో టీడీపీ హయాంలో సౌర విద్యుత్‌ ధర యూనిట్‌ రూ.6.99, పవన విద్యుత్‌ యూనిట్‌ రూ.4.84 వంతున కొనుగోలు చేసేలా పీపీఏలు కుదుర్చుకున్నారని ఆరోపించారు. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి