కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో లోకేశ్వర్ వర్మ అనే అధికారిని స్పెషలాఫీసర్‌గా నియమించడంపై తెలుగుదేశం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికలలో అక్రమాలకు పాల్పడేందుకే ఆ అధికారిని అక్కడ నియమించారని తక్షణం ఆ లోకేశ్వర శర్మను కుప్పం పంపేయాలని పిటిషన్‌లో కోరారు.  తెలుగుదేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. 





Also Read : ముగిసిన స్థానిక సంస్థల నామినేషన్ల ప్రక్రియ... నెల్లూరు, కుప్పంలో రసవత్తరంగా ఎన్నికలు


స్థానిక ఎన్నికల సమయంలో లోకేశ్వర వర్మ పుంగనూరు మున్సిపల్ కమిషనర్‌గా ఉండేవారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతల నామినేషన్లు చెల్లకుండా చేశారని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు చేశారని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కుప్పంకు ప్రత్యేకాధికారిగా నియమించింది కూడా ఎన్నికల్లో అక్రమాలు చేయడానికేనని మండిపడుతున్నారు. 


Also Read: ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !


లోకేశ్వర వర్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. ఎంపీ రెడ్డప్పతో పాటు పలువురు వైఎస్ఆర్‌సీపీ నేతలతో కలిసి ఆయన పాల్గొన్న ప్రైవేటు కార్యక్రమాల ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఆయన అధికారి ముసుగులో ఉన్న  వైఎస్ఆర్‌సీపీ నేత అని టీడీపీ నేతలు మండి పడుతున్నారు. లోకేశ్వర వర్మ సుదీర్ఘ కాలంగా పుంగనూరులోనే పని చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే కుప్పంకు మార్చడంతో టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 


Also Read: టీడీపీ నేతలు డ్రామా ఆర్టిస్టులు... అలా చేస్తే ఒక్క నామినేషన్ కూడా వేయలేరు... మంత్రి అనిల్ కుమార్ కామెంట్స్


కుప్పంలో ఎలాగైనా  గెలవాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల గడువు ముగిసింది. అయితే పలువురు టీడీపీ అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కుప్పం ఎన్నికల ప్రత్యేకాధికారిని మార్చాలని టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేయడం ఆసక్తి రేపుతోంది. 


Also Read : ఆ విద్యుత్ ఒప్పందాల వెనుక రూ. లక్షా 20వేల కోట్ల స్కాం... టీడీపీ నేత పయ్యావుల తీవ్ర ఆరోపణలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి