ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. 14 జడ్పీటీసీ స్థానాలతోపాటు 176 ఎంపీటీసీ, 69 సర్పంచ్, 533 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామపంచాయతీలలో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 9 చివరితేదీ వరకు అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లులకు 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. పరిషత్‌ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 9వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 14న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నెల 15న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 17న కౌంటింగ్‌ జరగనుంది. ఈ నెల 16న పరిషత్‌ ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి 18న కౌంటింగ్‌ జరగనుంది. 


Also Read: ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !


నెల్లూరు కార్పొరేషన్ కు ఎన్నికలు


నెల్లూరు కార్పొరేషన్‌తో, 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లోని 54 డివిజన్లు, 353 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అలాగే 7 కార్పొరేషన్‌లు, 13 మునిసిపాలిటీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల మరణంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటితో పాటు ఈ ఏడాది మార్చిలో ఎన్నికలు జరగని డివిజన్లు, వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 


Also Read: టీడీపీ నేతలు డ్రామా ఆర్టిస్టులు... అలా చేస్తే ఒక్క నామినేషన్ కూడా వేయలేరు... మంత్రి అనిల్ కుమార్ కామెంట్స్


కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు


ఎన్నికలు జరగనున్న స్థానాల్లో కుప్పం మున్సిపాలిటీ కూడా ఉంది. ఆకివీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, కుప్పం, బుచ్చిరెడ్డిపాలెం, బేతంచర్ల, కమలాపురం, రాజంపేట, పెనుకొండ మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 7 కార్పొరేషన్లలో 12 డివిజన్లు, 12 మున్సిపాలిటీల్లో 13 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 498 గ్రామ పంచాయతీల్లో 69 సర్పంచ్‌ స్థానాలకు కూడా ఎన్నికలు జరగునున్నాయి. ఖాళీగా ఉన్న  533 వార్డు మెంబర్లకు కూడా ఈ నెల 14న ఎన్నిక, అదేరోజు కౌంటింగ్‌ నిర్వహిస్తారు. 13 జిల్లాల్లో మిగిలిన 187 ఎంపీటీసీలు, 16 జడ్పీటీసీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. 


Also Read: ఏపీలో తొలిసారిగా వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులు ప్రదానం.. ఇకనుంచి ప్రతి ఏడాది: వైఎస్ జగన్


మరో స్థానిక సమరం


దాదాపుగా ప్రతి జిల్లాలోనూ ఎన్నికలు జరుగుతుండటంతో ఎన్నికల కోడ్ అంతటా అమలవుతుంది. ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు అనేక వివాదాలతో ఎన్నికలు జరిగాయి. చివరికి ఆయన మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను మాత్రమే నిర్వహించారు. ఆ తర్వాత ఎస్‌ఈసీగా నియమితులైన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికలపైనా అనేక వివాదాలు వచ్చాయి. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే కౌంటింగ్ జరిగింది. ఇప్పుడు మరో స్థానిక సమరం జరుగుతుంది.


Also Read: ఓ కార్పొరేషన్ -12 మున్సిపాలిటీల్లో ఎన్నికలు ! ఏపీలో మినీ స్థానిక సమరానికి షెడ్యూల్ రిలీజ్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి