ప్రభుత్వ ఉద్యోగి అని నమ్మితే నట్టేట ముంచేశాడు. ఆడంబరంగా రూ. లక్షలు ఖర్చు పెడుతూంటే ధనవంతుడనుకున్నారు. అందుకే అడినంత అప్పులు ఇచ్చారు. ఆయన దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్లేననుకున్నారు. అందరూ కలిసి తమ వద్ద ఉన్న డబ్బులు ఆయనకే వడ్డీకి ఇచ్చారు. చిట్స్ వేసి ఆయన దగ్గరే ఉంచారు. తీరా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. తమ డబ్బులు ఇప్పించాలంటూ పోలీసుల దగ్గరకు పరుగులు పెట్టారు. ఈ ఘరానా మోసం కళ్లూరు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది.
Also Read : టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతల దాడి
కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో లో హెల్త్ సూపర్‌వైజర్‌గా విజయ్ శేఖర్ రావు అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి జీతం మాత్రమే కాదని పెద్ద ఎత్తున ఇతర ఆదాయం ఉంటుందని తనఇంటి చుట్టుపక్కల వారిని నమ్మించేవాడు. భారీగా ఖర్చు పెడుతూ ఉండేవాడు. తనకు చాలా ఆస్తులు ఉన్నాయని ప్రచారం చేసుకునేవాడు. దీంతో విజయ్ శేఖర్ రావును ఆ చుట్టుపక్కల ప్రజలు అందరూ పెద్ద మనిషిగా గుర్తించేవారు. ఈ గుర్తింపు వచ్చిన తర్వాత విజయ్‌శేఖర్ రావు తన విశ్వరూపం చూపించాడు.
Also Read : కాబోయే ఎన్నారై భర్త పాడుపని.. న్యూడ్ వీడియో కాల్స్, సూసైడ్ చేసుకున్న యువతి
బ్యాంకులో ఉన్నా.. తన వద్ద ఉన్నా ఒక్కటేనని చెప్పి అప్పులు తీసుకోవడం ప్రారంభించారు. చిట్స్ వ్యాపారం కూడా అనధికారికంగా నిర్వహించేవారు. చిట్స్ సమయం ముగిసినా ఎవరికీ డబ్బులు తిరిగి ఇచ్చేవాడు కాదు. వడ్డీకి తన వద్దనే ఉంచుకునేవాడు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కావడంతో మన సొమ్ము ఎక్కడికీ పోదులే అని అందరూ అనుకునేవారు. ఇటీవలే ఆయన కుమార్తె పెళ్లిన అట్టహాసంగా చేశారు. పలువురు ప్రముఖుల్ని ఆహ్వానించారు.
Also Read: Anantapur: రోకలి బండతో కొట్టి భర్తను చంపిన భార్య.. వెంటనే పోలీసులకు ఫోన్ చేసి..
అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చిట్స్ సభ్యులకు డబ్బులివ్వడం మానేశాడు. అప్పులు ఇచ్చిన వారికి కనీసం వడ్డీలు కూడా ఇవ్వలేకపోతున్నారు. గట్టిగా అడిగితే తన వద్ద పైసా లేవని సమాధానం చెబుతున్నారు. ఇలా మొత్తం రూ. ఎనిమిది కోట్ల వరకూ వసూలు చేసి ఖర్చు చేసుకున్నారు. ఇప్పుడు తమ డబ్బులు తమకు ఇప్పించాలంటూ ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఇది సివిల్ కేసు కావడం.. వారు డబ్బులిచ్చినట్లుగా పెద్దగా ఆధారాలు లేకపోవడంతో పోలీసులు కూడా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు.
Also Read: CID Murders : ముసలామెను చంపి డబ్బు, నగలు దోచుకెళ్లిన మైనర్లు ! ఈ నేరం నేర్పింది ఆ టీవీ షోనే...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి