Visakha: టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతల దాడి

Continues below advertisement

టోల్ ప్లాజా సిబ్బందిపై వైఎస్సార్ సీపీ నేతలు దాడికి పాల్పడటం కలకలం రేపింది. పాయకరావుపేట వైఎస్సార్ సీపీ నేతలు విశాఖపట్నం నక్కపల్లి మండలం వేంపాడు  టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసి గాయపరిచారు. టోల్ ప్లాజా వద్ద టోల్ ఫీజు అడిగినందుకు సత్యనారాయణ అనే సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తలకు బలమైన గాయమైన సిబ్బందిని నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం విశాఖ కల్యాణి ఆసుపత్రికి తరలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram