విజయనగరం జిల్లాలో మూడు రోజులుగా చెరుకు రైతుల ఆందోళన ఉద్రిక్తలకు కారణం అవుతోంది. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీ నుంచి తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేశారు. అయితే రైతులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. రైతులు కూడా తిరగబడటం చర్చనీయాంశమయింది.ఈ క్రమంలో రైతులపైనా కేసులు పెట్టారు. కొంతమందిని అరెస్ట్ చేశారు.  వివాదం అంతకంతకూ పెద్దది అవుతూండటంతో విజయనగరం జిల్లాకే చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. 


Also Read : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


చక్కెర ఫ్యాక్టరీ బకాయి ఉన్న రైతులకు అణా పైసలతో సహా చెల్లిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. 80 వేల ఎకరాల్లో సాగుచేసిన చెరకు కొనుగోలు చేయాలన్నారు. రైతులకు చెల్లించాల్సింది కేవలం రూ.6 కోట్లేనని బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల ఆందోళనల వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని ఆరోపించారు. చక్కెర నిల్వలను విక్రయించగా వచ్చిన మొత్తాన్ని రైతుల బకాయిల చెల్లింపు చేసిన తర్వాతనే మిగిలిన మొత్తాన్ని యాజమాన్యానికి చెల్లించాలని గత సమావేశాల్లో నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం అమలు కాలేదు.  ఎందుకు చెల్లించలేదో అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు.


Also Read: CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?


బొత్స సత్యనారాయణ రూ. 9కోట్లు మాత్రమే  చెల్లించాలని చెబుతున్నారు కానీ.. గత రెండేళ్లుగా కంపెనీలు చెల్లింపులు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగార యాజమాన్యం తీరుపై రైతులు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. రెండు క్రషింగ్‌ సీజన్‌లకు సంబంధించిన రూ.16.33 కోట్ల బకాయిలను ఎన్‌సీఎస్‌ యాజమాన్యం రైతులకు చెల్లించాల్సి ఉందంటున్నారు.  మంత్రులు కూడా ఎప్పటికప్పుడు హామీలు ఇవ్వడమే తప్ప కార్యాచరణ కనిపించకపోవడంతో రోడ్డెక్కారు.  


Also Read : సదరన్‌ జోనల్ కౌన్సిల్‌ భేటీకి ఆరు అంశాలతో ఏపీ రెడీ.. ప్రత్యేక హోదా ప్రస్తావించాలన్న సీఎం జగన్


రెండేళ్ల నుంచి బకాయిలు ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోలేదని ప్రభుత్వంపై రైతులు అసంతృప్తితో ఉన్నారు. గతంలో హామీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. మంత్రి బొత్స అణాపైసా సహా ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ.. ఎప్పట్లో చెప్పడం లేదని.. రైతుల ఉద్యమాన్ని అణిచి వేసేందుకు అరెస్టులు చేస్తున్నారని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 


Also Read : పెట్రో రేటు తగ్గింపు సరే.. ఏయే రాష్ట్రాలు ఎంత తగ్గించాయో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి