కొన్ని నెలలుగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఇంధన ధరలపై కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. అయితే ఈ ధరలతో జనాలకు ఎంతో కొంత ఉపశమనం కలిగినట్టైంది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించాయి. వ్యాట్ ను తగ్గించి.. ఊరట కలిగించాయి. అసోం, త్రిపుర, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, గోవా, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, ఒడిశా లాంటి రాష్ట్రాలు తగ్గించాయి.   


ఎక్కడెక్కడ తగ్గించారంటే.. 
అసోంలో పెట్రోల్‌, డీజిల్‌పై  రూ. 7 చొప్పున తగ్గించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్‌ శర్మ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన తగ్గింపుతో కలిపి అసోంలో పెట్రోల్‌ రూ.12, డీజిల్‌ రూ.17 మేర తగ్గుతోంది.


త్రిపురలోనూ పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 తగ్గించారు. గురువారం నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వస్తుందనిముఖ్యమంత్రి విప్లవ్‌ దేవ్‌ పేర్కొన్నారు.


కర్ణాటక ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.7 చొప్పున తగ్గిస్తున్నట్లు  తెలిపింది. ఈ తగ్గింపుతో ఆ రాష్ట్ర ఖజానాకు రూ.2100 కోట్ల వరకు ఆదాయం తగ్గుతుంది.


గోవాలోనూ రూ.7చొప్పున వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు సీఎం ప్రమోద్‌ కుమార్‌ సావంత్‌ ప్రకటించారు. పెట్రోల్‌ ధర రూ.12, డీజిల్‌ ధర రూ.17 మేర తగ్గనుందని ట్విట్ చేశారు.


బిహార్‌ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.1.30, డీజిల్‌పై రూ.1.90 చొప్పున తగ్గిస్తున్నట్లు చెప్పింది.


ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం లీటర్‌ పెట్రోల్‌పై రూ.2 వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు తెలిపింది.


మణిపూర్ లో పెట్రోల్‌పై రూ.7, డీజిల్‌పై రూ.7 చొప్పున వ్యాట్‌ తగ్గించారు. 


ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించింది. కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకొని ఆ రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌ రూ.12 మేర తగ్గుతుంది. 


గుజరాత్‌ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై రూ.7చొప్పున తగ్గించింది.


హరియాణాలో కేంద్రం తగ్గించిన ఎక్సైజ్‌ సుంకంతో కలుపుకుని పెట్రోల్,డీజిల్ పై రూ.12మేర తగ్గనున్నాయి.  


పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గిస్తూ త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం తెలిపింది.


ఒడిశాలో పెట్రోల్,డీజిల్ పై రూ.3 మేర తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్‌ 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.


Also Read: Petrol Diesel Price Drop: దీపావళికి కేంద్రం బంపర్ ఆఫర్.. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు


Also Read: Petrol-Diesel Price, 4 November: గుడ్‌న్యూస్.. కేంద్రం నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుదల