ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 9వేల మెగావాట్ల విద్యుత్‌ను సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా .. సెకీ నుంచి కొనుగోలు చేసేందుకు చేసుకున్న ఒప్పందాలపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. భారీ స్కాం జరిగిందని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సెకీ సంస్థతో ప్రతిపాదనలు రావడం.. ఒప్పందాలు జరగడం అన్నీ గంటల్లో జరిగిపోయాయని పయ్యావుల పత్రాలు బయట పెట్టారు. ఎలాంటి పరిశీలన లేకుండా ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. 


Also Read : టీడీపీ నేతలు డ్రామా ఆర్టిస్టులు... అలా చేస్తే ఒక్క నామినేషన్ కూడా వేయలేరు... మంత్రి అనిల్ కుమార్ కామెంట్స్


సెకీ నుంచి రూ. 2.49కే యూనిట్ విద్యుత్ కొంటున్నామని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని కానీ.. 2020 నవంబర్ నెలలో సెకీ పిలిచిన టెండర్లల్లో రూ. 2కే సౌర విద్యుత్ ఇచ్చారని పత్రాలు విడుదల చేశారు. అలాగే సెకీ నుంచి గుజరాత్ రూ. 1.99కే సౌర విద్యుత్ కొనుగోలు చేసిందన్నారు. గత ఏడాదే అంత తక్కువకు అమ్మితే ఇప్పుడు రూ. 2.49 ఏపీ కొనుగోలు చేయడం ఏమిటని పయ్యావుల ప్రశ్నించారు. నిజానికి ఇది కూడా అసలు రేటు కాదన్నారు. సెకీ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి చేయదని రాజస్థాన్ ప్లాంట్ నుంచి సరఫరా చేస్తుందన్నారు. దీని వల్ల సెకీ నుంచి డిస్కంలకు విద్యుత్ చేరే నాటికి రూ. 2.49 కాదు.. అంతకంటే ఎక్కువే పడుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు ఉపసంహరిస్తే అది రూ. 4.50 దాటినా ఆశ్చర్యం లేదన్నారు. 


Also Read: తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?


అన్నీ దాచి పెట్టి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వల్ల పేదలు.. రైతులపై రూ. 1.20 లక్షల కోట్ల భారం పడుతుందని పయ్యావుల ఆరోపించారు. రైతుల పేరుతో జరిగే ఈ విద్యుత్ కోనుగోళ్ల వ్యవహరం స్కీమ్ కాదు స్కామన్ అని మండిపడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా గుజరాత్‌కు లాభాలు.. రాజస్థాన్‌కు పెట్టుబడులు పెట్టి వారి వద్ద నుంచి కరెంట్ కొని ఏపీకి తీవ్ర అన్యాయం చేస్తున్నారని పయ్యావు మండిపడ్డారు. ఏపీలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌళిక సదుపాయాలు ఉన్నా.. పక్క రాష్ట్రాల్లో లబ్ది కలిగించడం దేనికని, ఈ స్కీమ్ అమలు చేయాలనుకుంటే ఈ రాష్ట్రంలోనే సౌర విద్యుత్ కొనుగోలు చేసేలా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు. 


Also Read: ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !


తెలుగుదేశం పార్టీ హయాలంో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలోనే సంప్రదాయేతర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా  6600 మెగావాట్లకు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ వచ్చిన తర్వాత గ్రిడ్ సామర్థ్యం లేదని ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నారు. ఇప్పుడు 9వేల మెగా వాట్లను కొనేందుకు అధిక రేటుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు గ్రిడ్ సామర్థ్యం ఎలా వచ్చిందని పయ్యావలు ప్రశ్నించారు. 


Also Read:  నామినేషన్ల పేపర్లు లాక్కెళ్లిపోతున్నా భద్రత కల్పించరా ? ఎస్‌ఈసీకీ చంద్రబాబు ఘాటు లేఖ !


పేరుకు సెకీ అయినా ఆ ఒప్పందం అంతా అదానీ కంపెనీకి వెళ్తుంది. దేశంలో భారీగా సౌర విద్యుత్‌ ఉత్పత్తికి సెకీ 2019 జూన్‌లో టెండర్లు పిలిచింది. ఆ టెండర్లలో అదానీ పవర్‌ విజేతగా నిలిచింది. ఇప్పుడు సెకీ పేరుతో అదానీ కంపెనీనే ఏపీకి విద్యుత్ సప్లయ‌ చేస్తుందని.. ఇదంతా ఓ స్కామ్ అని టీడీపీ నేత పయ్యావుల అంటున్నారు. సీఎంకు తెలియకుండా ఇదంతా జరుగుతుందా అని ప్రశ్నించారు. 


Also Read : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం... ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి.. ఆలస్య హాజరు ఎక్కువైతే వేతనాల్లో కోత


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి