కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో యథేచ్చగా దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని ఫోటోలు తన లేఖకు జత చేశారు. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని తెలిపారు.. 30 మంది వైఎస్ఆర్‌సీపీ కార్యక్తలు దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. వెంకటేశ్ నామినేషన్ పత్రాలు చించివేసి.. ఫోన్ లాక్కొన్నారన్నారు.
Also Read : ఆ రైతుల వెనుక టీడీపీ... అందరికీ అణాపైసలతో సహా చెల్లిస్తామన్న బొత్స !
హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని ఎస్‌ఈసీని కోరారు. దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. కుప్పం మున్సిపల్ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారమే నామినేషన్లకు ఆఖరు రోజు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు దిగి నామినేషన్లు వేయకుండా చేస్తున్నారని.. నామినేషన్ వేసిన అభ్యర్థుల్ని బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read : తెలుగు రాష్ట్రాలపై పెట్రో పన్నుల తగ్గింపు ఒత్తిడి ! ఇప్పుడేం చేయబోతున్నారు ?
ఒక్క కుప్పంలోనే కాకుండా గురజాల లాంటి చోట్ల కూడా నామినేషన్లు లాక్కెళ్లిపోయారన్న ఫిర్యాదులు టీడీపీ నేతలు చేస్తున్నారు. తమకు భద్రత కల్పించాలని నలుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ మేరకు వారికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే పోలీసులు భద్రత కల్పించకపోవడంతో దీపావళి రోజున ప్రతిపక్ష నేత చంద్రబాబు మీడియా సమావేశంలో మండిపడ్డారు. తర్వతా లేఖ రాశారు. ఆ తర్వాత ఎస్‌ఈసీ కార్యదర్శి ఆఆ అభ్యర్థులకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించారు.
Also Read: CM Jagan Tour: ఈ నెల 9న ఒడిశాకు ముఖ్యమంత్రి జగన్.. నవీన్ పట్నాయక్ తో భేటీ.. ఎందుకంటే?
ఇంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అనేక ఆరోపణలు చేసింది. దాడులు, దౌర్జన్యాలతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి అనైతికంగా గెలిచారని ఆరోపిస్తున్నారు. అక్రమాలకు పాల్పడకుండా ప్రజల ఓట్లతో గెలవలాని టీడీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. అయితే తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడటం లేదని టీడీపీ నేతలు రాజకీయం కోసం ఆరోపణలు చేస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేతలంటున్నారు.