Breaking News Telugu Live Updates: బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 350 మందికి పైగా అస్వస్థత
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Background
నైరుతి రుతుపవనాలు, అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. దక్షిణ కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం తాజాగా ఉత్తర కోస్తా ఒడిశా దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారింది. అనుబంధ ఉపరిత ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల పైన విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ద్రోణి జైసల్మీర్, కోటా, గుణ, సాగర్, జబల్ పూర్, పెండ్రా రోడ్డు, అల్పపీడన ప్రాంతం ఉత్తర ఒడిశా దాని పరిసర ప్రాంతాల మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు వెళ్లి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. తూర్పు పడమర గాలుల కోత ఉత్తర భారత ద్వీపకల్పమైన 19 డిగ్రీ ఉత్తర అక్షాంశం వెంట సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ, 7.6 కి.మీ మధ్య విస్తరించి ఉంది.
తెలంగాణలో వారం రోజుల నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నేడు సైతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ అర్బన్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ నేటి నుంచి రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు ముగుసినా ఏడుకొండలకు భక్తులు పోటెత్తుతున్నారు. కలియుగ దైవం శ్రీనివాసుడి దివ్యధామం తిరుమల పుణ్యక్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమోగుతుంది. నిన్న ఒక్క రోజులో 74,304 మంది స్వామి వారి దర్శించుకున్నారు.. ఇక స్వామి వారికి 31,880 మంది తలనీలాలు సమర్పించగా, 5.45 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండడంతో బయట క్యూలైన్స్ లో భక్తుకు వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వదర్శనంకు 20 గంటల సమయం పడుతుంది.. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు మూడు గంటల సమయం పడుతుంది..
తెలంగాణతో పాటు ఎగువున కురుస్తున్న భారీ వర్షాల వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 67.9 అడుగులకు చేరుకుంది. దీంతో బూర్గంపాడు మండలంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహానాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బూర్గంపాడు మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయం పోలీస్ స్టేషన్ కూడా నీటమునిగాయి సారపాక లోని నేషనల్ హైవే 30 పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రముఖ కాగితపు పరిశ్రమ ఐటీసీలోకి కూడా నీరు చేరటంతో ఐటీసీ యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది.
బాసర ట్రిపుల్ ఐటీలో పుడ్ పాయిజన్, 350 మందికి పైగా అస్వస్థత
నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో శుక్రవారం ఫుడ్ పాయిజన్ జరిగింది. మెస్ లో మధ్యాహ్నం ఎగ్ కర్రీ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 350 మందికి పైగా విద్యార్థులు స్వల్ప వ్యవధిలోనే వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. విద్యార్థులను చికిత్స కోసం ట్రిపుల్ ఐటీలోని ఆస్పత్రిలో జాయిన్ చేశారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ కు చేదు అనుభవం... వాహనాల అద్దాలు ధ్వంసం
ఎన్నికల్లో హామీ ఇచ్చినా బ్రిడ్జి కట్ట లేదంటూ గ్రామస్తుల నిరసన... వాహనాల అద్దాలు ధ్వంసం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి గ్రామస్తులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ని అడ్డుకున్నారు గోదావరి పరివాహక గ్రామం కావడంతో గ్రామాలను పరిశిలించేందుకు వచ్చిన ఎంపీ కి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల సమయంలో ఎంపీ గా గెలిపిస్తే గ్రామంలో బ్రిడ్జి కట్టిస్తానన్న హామీ మరియు గ్రామంలో ఉన్న మల్లన్న గుట్ట సమస్య పరిష్కరిస్తానన్న హామీ ఏమైందని గ్రామస్థులు నిలదీసారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఆయన వెంట వచ్చిన కాన్వాయ్ లోని రెండు వాహనాల అద్దాలు పగలగొటారు.





















