అన్వేషించండి

Avinash Reddy Mother Health : కుదుటపడిన అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం - సాధారణ వార్డుకు మారుస్తామన్న వైద్యులు !

అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని వైద్యులు ప్రకటించారు. సాధారణ వార్డుకు మారుస్తామన్నారు.

Avinash Reddy Mother Health :  కడప ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితి కుదుట పడిందని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి ఉందని వైద్యులు తెలిపారు.  వాంతులు తగ్గాయని .. ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నామని హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆరు రోజుల నుంచి అవినాష్ రెడ్డి తల్లి విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆస్పత్రిలోనే ఉన్నారు. 

19వ తేదన అనారోగ్యానికి గురైన అవినాష్ రెడ్డి తల్లి                                             
 
ఈ నెల 19వ తేదీన  పులివెందులలో  శ్రీలక్ష్మి  అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను పులివెందులలోని దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్సకు హైద్రాబాద్ కు తరలించాలని భావించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల19న సీబీఐ విచారణకు  హాజరవ్వాల్సి ఉండగాతల్లికి అస్వస్థత గరించి తెలియగానే సీబీఐ విచారణకు వెళ్లకుండా నేరుగా పులివెందులకు వెళ్లారు.   పులివెందులకు  వెళ్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద తల్లి వస్తున్న అంబులెన్స్ ఎదురైంది. అదే అంబులెన్స్  ద్వారా  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో శ్రీలక్ష్మిని  చేర్పించారు. 

ఆ రోజు నుంచి కర్నూలు విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స                                                 
 
మరోవైపు అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు   రోజూ హెల్త్  బులిటెన్ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. మొదటి రోజు ఆమె పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తెలిపారు.   రెండు కవాటాలూ పని చేయట్లేదని తెలిపారు. ఆమెకు లోబీపీ ఉందనీ... ఐసీయూలోనే ఉంచి ట్రీట్‌మెంట్ చేయాల్సి ఉందని తెలిపారు. ఐదు రోజుల చికిత్స తర్వాత ఆమె పరిస్థితి మెరుగుపడినట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ఆస్పత్రిలోనే ఉంటున్నారు. మరో వైపు సీబీఐ అధికారులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారం  జరుగుతూండటంతో పెద్ద ఎత్తున అవినాష్ రెడ్డి అనుచరులు ఆస్పత్రి వద్దే ఉంటున్నారు. 

అవినాష్ రెడ్డి తల్లికి పలువురి పరామర్శ 

ఆస్పత్రి వద్ద అనుచరులు పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో ఇతర రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఆస్పత్రిలో ఉన్న అవినాష్ రెడ్డి  తల్లిని జగన్ తల్లి విజయలక్ష్మి పరామర్శించారు. ఆ తర్వాత  వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరి విమలారెడ్డి పరామర్శించారు. పలువురు. వైఎస్ఆర్‌సీపీ నేతలుకూడా వచ్చి.. అవినాష్ రెడ్డి తల్లిని పరామర్శించారు. అవినాష్ రెడ్డి తల్లి ఆరోగ్యం మెరుగుపడేదాకా.. అవినాష్ రెడ్డిని ప్రశ్నించవద్దని..  ఆయన అనుచరులు ఆస్పత్రి ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget