Chandrababu: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం
Cases on Chandrababu: ఉచిత ఇసుక పథకంపై సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
AP Sand Scam Case: ఏపీ ఇసుక స్కామ్ కేసులో (Sand Scam) తనను ఇరికించారని ఆరోపిస్తున్న చంద్రబాబు నాయుడు ఆ కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా, ఉచిత ఇసుక పథకంపై సీఐడీ (AP CID) నమోదు చేసిన కేసులో చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన పిటిషన్ బుధవారం (నవంబరు 8) విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఉచిత ఇసుక పథకం పేరుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఏపీఎండీసీ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసు నమోదు చేసింది.
సీఐడీ కేసులు - ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు పిటిషన్లు
మరోవైపు ఏపీ సీఐడీ (AP CID) తనపై మోపిన ఇసుక కేసు (Sand Case)లో ముందస్తు బెయిల్ (Bail) మంజూరు చేయాలని కోరుతూ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటే దానిని కూడా తప్పు పట్టడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉచిత ఇసుక (Free Sand Policy) ఇవ్వడం కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని, ఉచిత ఇసుక విధానంపై కేబినెట్ (AP Cabinet)లో ముందు చర్చించలేదంటూ ఎఫ్‌ఐఆర్ (FIR)లో సీఐడీ పేర్కొనడాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ముందస్తు బెయిల్ పిటిషన్ రేపు (నవంబరు 8) విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులోనూ విచారణను సీఐడీ వాయిదా కోరే అవకాశం ఉంది.
ఇన్నర్ రింగ్ రోడ్ (Inner Ring Road) అలైన్‌మెంట్ మార్చిన కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు (AP High Court) ఈ నెల 22కు వాయిదా వేసింది. అడ్వకేట్ జనరల్ (Advocate General) విజ్ఞప్తితో విచారణ వాయిదా పడింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్ (Interim Bail)పై ఉన్నారని కోర్టు దృష్టికి ఏజీ తీసుకొచ్చారు. ఈ కేసులో తాము పీటీ వారెంట్‌పై ఒత్తిడి చేయబోమని ఏజీ చెప్పారు. గతంలో ఉన్న ఉత్తర్వులు కొనసాగుతాయని అన్నారు. వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఆరోగ్య కారణాలతో హైకోర్టు చంద్రబాబుకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం దాఖలు చేసిన వరుస కేసుల్లో బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదాలు కోరుతోంది ప్రభుత్వం.