Breaking News Live: IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు, సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 22 Apr 2022 02:42 PM
Tadepalli News: వృద్దురాలి భూమిని కబ్జా, అధికార పార్టీ నేత పనేనని బాధితురాలు ఆవేదన

Tadepalli News: గుంటూరు జిల్లా: తాడేపల్లి మహానాడులో అధికార పార్టీ నాయకుడు బాలసాని అనిల్ తన స్థలాన్ని కబ్జా చేశారని వృద్దురాలు కన్నీటి‌ పర్యంతం అయ్యారు. తెనాలికి చెందిన వృద్ధురాలు‌ ఇక్కడ కొంత భూమిని కొన్నారు.‌ ఇటీవల తన స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు రాగా, ఆ స్థలాన్ని ఆక్రమించి అధికార పార్టీ నేత అనుచరులు  దౌర్జన్యానికి దిగారని ఆవేదన వ్యక్తం చేసింది. స్థలంలోకి అడుగు పెడితే చంపేస్తాం అంటూ బెదిరించారని తెలియచేసింది. భూ కబ్జాకు పాల్పడిన వ్యక్తికి అధికార పార్టి నేతల అండదండలు ఉన్నాయని ఆరోపించింది వృద్దురాలు. తన స్థలాన్నీ ‌ఆక్రమించి భూకబ్జా కు పాల్పడిన నాయకుడు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ, తాడేపల్లి పోలీసులను ఆశ్రయించానని ఆమె తెలిపారు. ఇంతవరకు తనకు న్యాయం జరగలేదని‌‌ వృద్దురాలు ఆవేదన వ్యక్తంచేశారు.  గత కొంతకాలంగా ఇదే తరహాలో భూ కబ్జాకు పార్టీ నాయకుడు, అతని అనుచర గణం పాల్పడుతూ, బెదిరిస్తున్నారని స్థానికులు సైతం ఆరోపిస్తున్నారు.

IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రద్దు, సర్వీసులోకి తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు

రెండేళ్లకుపైగా సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (  ABV )కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనపై సస్పెన్షన్‌ను రద్దు చేయడంతో పాటు మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ సర్కారును సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐపీఎస్ లకు రెండేళ్లకు మించి సస్పెన్షన్ ఉండకూడదని సుప్రీంకోర్టు సూచించింది. ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇదివరకే వాదనలు జరిగాయి. ఇంకా ఎంత కాలం పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెన్షన్‌లో ఉంచుతారని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఏబీ వెంకటేశ్వరరావుపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేసినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

Vijayawada Govt Hospital: వాసిరెడ్డి పద్మకు చేదు అనుభవం

విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. రేప్‌‌నకు గురైన యువతిని పరామర్శించేందుకు వచ్చిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్టి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అతి కష్టం మీద వాసిరెడ్డి పద్మ ఆసుపత్రి లోపలికి ప్రవేశించారు.

Warangal News: వరంగల్‌లో ఉన్మాది దురాగతం- ప్రేమించడం లేదని యువతి గొంతు కోసిన యువకుడు

వరంగల్‌లో దారుణం జరిగింది. కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ చదువుతున్న యువతిని ఉన్మాది గొంతు కోశాడు. ఆమె చుట్టూ కొంతకాలంగా ప్రేమ పేరుతో తిరుగుతూ వేధిస్తున్న అజహర్. ప్రేమను అంగీకరించలేదని తనను పట్టించుకోవడం లేదని కోపంతో హత్యాయత్నం చేసిన అజహర్. ఈ ఉదయం కాలేజీకి వెళ్తున్న యువతిపై దాడి చేసిన ఉన్మాది. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేసి దురాగతం. విద్యార్థిని గొంతుకోసి పారిపోయిన అజహర్‌. 

Bhatti Vikramarka: భట్టి పాదయాత్రలో వీహెచ్ సందడి, కోలాటంతో కోలాహలం

ఖమ్మం జిల్లా మధిర మండలంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సాగుతోంది. ఈ పాదయాత్రలో వీహెచ్ పాల్గొన్నారు. కార్యకర్తలను తన ఆట పాటలతో, కోలాటంతో ఉత్సాహపరిచారు. తొండల గోపారం, మీనవోలులో సీఎల్పీనేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో హనుమంతరావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి హామీని మరిచారని, అందరినీ మోసం చేశారని వీహెచ్ మండిపడ్డారు. మంత్రి పువ్వాడ అజయ్ అరాచకాలు సాగుతున్నాయని, వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.

Shots fired at Rohini court: ఢిల్లీలోని రోహిణి కోర్టులో మరోసారి కాల్పులు కలకలం

ఢిల్లీలోని రోహిణి కోర్టులో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. కోర్టు వద్ద భద్రత కోసం ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బంది కాల్పులు జరిపాడని ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. కాల్పుల ఘటన విషయాన్ని ఉన్నతాధికారులకు పోలీసులు తెలిపారు. కాగా, గత ఏడాది సైతం రోహిణి కోర్టులో కాల్పులు జరిగాయి.





Hyderabad Pub Case: ఫుడింగ్ అండ్ మింక్ పబ్ కేసులో విచారణ వేగవంతం

హైదరాబాద్లో కొద్ది రోజుల క్రితం నాటి ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు వేగం ప్రదర్శిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మరో ముగ్గురుని పోలీసులు నేడు విచారించనున్నారు. నిన్న శశికాంత్, సంజయ్‌లను పోలీసులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. డ్రగ్స్ కేసులో టోని, అభిషేక్‌లతో సంబంధాలున్న వారి వివరాలను ఇప్పటికే సేకరించారు. అభిషేక్ కాల్ డేటాలో మరికొంత మంది పేర్లు లభించాయి. పబ్‌లో దొరికిన డ్రగ్స్, అభిషేక్‌తో ఉన్న సంబంధాల విషయమై నేడు మరో ముగ్గురిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

Telangana ACB: శేరిలింగంపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి ఇంట్లో భారీ ఆస్తులు గుర్తించిన ఏసీబీ

* ఆదాయానికి మించిన ఆస్తుల కలిగిన ఉన్నారని సిటీ ప్లానర్ నర్సింహులు ఇంటిపై ఏసీబీ సోదాలు


* ఏకకాలంలో నాలుగు చోట్ల సోదాలు చేసిన ఏసీబీ..


* ఇప్పటి వరకు 15 కోట్ల ఆస్తులను గుర్తించిన ఏసీబీ..


* ఏసీబీ సోదాలు జరిగే సమయంలో ఇంట్లో, ఆఫీస్ లో లేని నర్సింహులు..


* షిరిడి సాయి దర్శనానికి వెళ్లిన నర్సింహులు..


* నర్సింహులు కార్యాలయంలో పలు డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భారీగా గుర్తింపు


* నేడు పూర్తి వివరాలు తెలపనున్న ఏసీబీ

Jagan Tour in Ongole: సీఎం జగన్ ఒంగోలు పర్యటన నేడు

ముఖ్యమంత్రి జగన్‌ నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. వైఎస్సార్‌ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్న జగన్ పది గంటలకు ఒంగోలు చేరుకుని పీవీఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం వైఎస్సార్‌ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 12 వందల 61 కోట్ల రూపాయలను డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో జమ చేసేలా బటన్‌ నొక్కి నిధులు విడుదల చేయనున్నారు.

Background

ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న పొడుగాలులు ఏపీ, తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడుతో పాటు యానాంలపై ప్రభావం చూపుతాయని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్న తెలంగాణలో హైదరాబాద్‌లో, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. ఏపీలోనూ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. నేడు సైతం తీరం వెంట 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో ధాన్యం తడవకుండా అన్నదాతలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
ఎండలతో సతమతమవుతున్న ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రజలకు ఊరట లభించింది. నిన్న కురిసిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఇక్కడ పగటి ఉష్ణోగ్రతలు దిగొచ్చియి. విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో నేడు సైతం వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా అరకు-పాడేరు పరిధిలో భారీ మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి మెళ్లగా పార్వాతీపురం మణ్యం జిల్లా వైపుగా విస్తరిస్తున్నాయి. విశాఖ నగరంతో పాటుగా అనకాపల్లి, పార్వతీపురం మణ్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆకాశం ప్రస్తుతం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం తరువాత వర్షాలు పడే సూచన ఉన్నట్లు అధికారులు తెలిపారు. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు -చింతపల్లి -మారేడుమిల్లి పరిధిలో వర్ష సూచన ఉంది. ఈ ప్రాంతాల్లో అత్యధికంగా జంగమేశ్వరపురంలో 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.


రాయలసీమలో వాతావరణం..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ జిల్లాలకు నేడు ఎలాంటి వర్ష సూచన లేకపోవడంతో భానుడి ప్రతాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. రాయలసీమలో ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీల మధ్యలో నమోదుకానుంది. దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎండ వేడి కొనసాగుతుంది. కర్నూలులో అత్యధికంగా 41.8 డిగ్రీలు, తిరుపతి, అనంతపురం, వైఎస్సార్ జిల్లాలో 40.2 డిగ్రీల చొప్పున భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప, ఇళ్ల నుంచి బయటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు. రోజుకూ దాదాపు 5 లీటర్ల వరకు నీరు తాగాలని, లేకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలను హెచ్చరించారు.


తెలంగాణలో వెదర్ అప్‌డేట్
తెలంగాణ రాష్ట్రంలో 45 ఉష్ణోగ్రతలకు చేరిన ఉష్ణోగ్రతలు నేడు తగ్గాయి. నిన్న కురిసిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో చలి గాలులు వీస్తున్నాయి. దాదాపు 5 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నేడు దిగివస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర జిల్లాలు - భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట​, నల్గొండ​, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల​, ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిద్ధిపేట​, సిరిసిల్ల​, మేడ్చల్ మల్కాజ్ గిరి, కరీంనగర్, కమారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదుకానున్నాయి. నిన్న కురిసి వర్షాల ప్రభావంతో కొన్ని జిల్లాల్లో 2 నుంచి 3 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు తగ్గాయి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.