విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిడిల్ క్లాస్ యువకుడిగా, బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ అతడికి వచ్చింది. అందుకు కారణం 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా కూడా ఒకటి. ఇప్పుడు ఆ హిట్ ఇచ్చిన దర్శకుడితో ఆనంద్ దేవరకొండ మరొక సినిమా చేయనున్నాడు. 


వినోద్ అనంతోజు దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ!
'దొరసాని'తో కథానాయకుడిగా పరిచయమైన ఆనంద్ దేవరకొండకు ఆ సినిమా భారీ విజయం ఏమీ అందించలేదు. మంచి పేరు అయితే వచ్చింది గాని సూపర్ సక్సెస్ రాలేదు. ప్రేక్షకులలోకి అతడిని బాగా తీసుకు వెళ్ళలేదు. 'దొరసాని' తర్వాత ఓటీటీలో వచ్చిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' సినిమా క్లాస్ మాస్ అని తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమాకు వినోద్ అనంతోజు దర్శకుడు, జనార్ధన పసుమర్తి రచయిత. ఇప్పుడు వాళ్ళిద్దరితో కలిసి ఆనంద్ దేవరకొండ మరొక సినిమా చేస్తున్నాడు. 






ఆనంద్ దేవరకొండ జోడిగా మలయాళీ ముద్దుగుమ్మ
ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా జనార్దన్ పసుమర్తి రచన, వినోద్ అనంతోజు దర్శకత్వంలో రూపొందునున్న సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, వరుస విజయాలలో ఉన్న యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేయనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై తెరకెక్కనున్న ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ కథానాయికగా ఎంపికైంది.


సుహాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాలలో 'ఓ భామ అయ్యో రామ' ఒకటి. ఇటీవల గ్లింప్స్ విడుదల అయింది. అందులో హీరోయిన్ గుర్తుందా? ఆ అమ్మాయి పేరు మాళవిక మనోజ్. ఆ భామనే ఆనంద్ దేవరకొండకు జోడిగా ఎంపిక చేశారు.


Also Read: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?






సంక్రాంతి తర్వాత నుంచి షూటింగ్ షురూ!
సంక్రాంతి తర్వాత నుంచి ఆనంద్ దేవరకొండ, వినోద్ అనంతోజు సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మారేడుమిల్లిలో మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందని తెలిసింది. మెజారిటీ షూటింగ్ అంతా అక్కడే జరుగుతుందట. ఆ తరువాత కొన్ని కీలక సన్నివేశాలను హైదరాబాద్ సిటీలో షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ ఎంటర్టైనర్ అయితే ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది.


Also Readట్రైలర్ రిలీజ్ చేయకుంటే ఆత్మహత్య... 'గేమ్ ఛేంజర్' టీంకు రామ్ చరణ్ అభిమాని సూసైడ్ లెటర్