Breaking News Live: అండర్-19 ఆసియా కప్ లో భారత్ ఘనవిజయం
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
అండర్-19 ఆసియా కప్ ను భారత్ కైవసం చేసుకుంది. ఫైనల్ లో శ్రీలంకపై యంగ్ ఇండియా విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ లో భారత ఆటగాళ్లు అదరగొట్టింది. తొమ్మిది వికెట్ల తేడాతో యంగ్ ఇండియా విజయం సాధించింది. తొలుత బ్యాంటింగ్ చేసిన శ్రీలంక తొమ్మిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. భారత్ స్కోర్ 104/1.
భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 1270కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొదటి ఒమిక్రాన్ మరణం నమోదయింది. మహారాష్ట్రకు చెందిన 52 ఏళ్ల ఒమిక్రాన్ బాధితుడు గుండెపోటుతో చనిపోయాడు. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. యశ్వంత్ రావు చవాన్ ఆసుపత్రిలో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి 28న మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
ఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) మండలి 46వ సమావేశం ప్రారంభమైంది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతోన్న ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు, పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రీఫండ్ చెల్లింపులను తగ్గించుకునేందుకు విలోమ పన్ను విధానంపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయి. జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరుగుతోంది. ప్రస్తుతం జీఎస్‌టీ విధానంలో 5, 12, 18, 28 శాతం చొప్పున పన్ను రేట్లు అమల్లో ఉన్నాయి. అయితే 12, 18 శాతం పన్ను శ్లాబులను కలపాలని గత కొంతకాలంగా డిమాండ్లు ఉన్నాయి. చెప్పులు, దుస్తులపైన 5శాతం ఉన్న జీఎస్‌టీని 12శాతానికి పెంచిన జీఎస్టీ జనవరి 1, 2022 నుంచి అమల్లోకి రానుంది. వస్త్ర వ్యాపారులు, చేనేత కార్మికుల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో వీటిపై పన్ను రేట్లు సవరించే అవకాశం ఉంది.
జీవో 317 ను పునఃసమీక్షించి ఉద్యోగులు, టీచర్ల బదిలీలు ఇబ్బందులు తొలగించేలా చూడాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఉద్యోగులు, టీచర్లు తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.. కనుక ఈ జీవోలో ఉన్న లొసుగులు తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ తమిళిసైని బీజేపీ నేతల బృందం కోరింది.
తిరుపతి : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కేంద్ర సహాయక మంత్రి ఏల్.మురుగన్, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డిలు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
హైదరాబాద్... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపల్లిలో నేడు కాంగ్రెస్ రచ్చబండ కార్యక్రమం చేపట్టింది. కానీ ఈ రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేని కారణంగా పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ గా మోహరించి, టీపీసీసీ చీఫ్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
Background
వరుసగా మూడో రోజు బులియన్ మార్కెట్లో పసిడి ధర పతనమైంది. మరోవైపు వెండి ధర భారీగా పడిపోయింది. తాజాగా 22 క్యారెట్లపై రూ.250 మేర తగ్గడంతో 10 గ్రాముల (తులం) బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,900 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ప్రస్తుతం రూ.48,990 కి పడిపోయింది. ఇక స్వచ్ఛమైన వెండి ధర రూ.800 మేర తగ్గడంతో హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.65,500కి పడిపోయింది.
ఏపీ మార్కెట్లో బంగారం ధర రూ.270 మేర తగ్గింది. ఇక్కడ సైతం వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. విజయవాడలో 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,260 అయింది.. 22 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.44,900కు పతనమైంది. ఇక విశాఖపట్నం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,270 అయింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,900 కు దిగొచ్చింది. వెండి ధరలు ఏపీ, తెలంగాణలో ఒకే రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఏపీ మార్కెట్లోనూ కేజీ ధర రూ.800 మేర పతనం కావడంతో వెండి ధర రూ.65,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజుల నుంచి ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. డిసెంబర్ నెల మొదట్నుంచీ నేడు సైతం పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20 వద్ద ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే ఉంది. ఇక వరంగల్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధర స్థిరంగా ఉండగా.. లీటర్ పెట్రోల్ ధర రూ.107.91 కాగా... డీజిల్ ధర రూ.94.34 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం దాదాపు ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
ఇక విజయవాడలో పెట్రోల్ ధర 24 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.65 అయింది. 22 పైసల చొప్పున పెరగడంతో ఇక్కడ డీజిల్ ధర రూ.96.69కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర 0.85 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.109.90 కి చేరింది. డీజిల్ ధర 0.79 పైసలు పెరగడంతో విశాఖపట్నంలో డీజిల్ ధర లీటర్ రూ.95.97 అయింది.
తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ, తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి. తాజాగా ఆగ్నేశ దిశ, ఉత్తర దిశల నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. వీటి ప్రభావం అంతంతమాత్రంగానే ఉండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాల ప్రభావంతో చలి మరింత పెరిగే అవకాశం ఉంది.
ఏపీ వెదర్ అప్‌డేట్స్..
తూర్పు వైపు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌లో ఉంది. ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాల్లో నేటి నుంచి రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. మరోవైపు విశాఖ ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పుంజుకున్నాయి. లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులోనూ చలి తీవ్రత తగ్గుతోంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రాష్ట్రంలో వాతావరణం గత కొద్ది రోజుల నుంచి పొడిగా ఉంది. ఉత్తర, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న చల్ల గాలుల ప్రభావం ఉన్నా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అంచనా వేశారు. ఒడిశా, తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం తెలంగాణపై ఉంది.
Also Read: Petrol Price 31 December 2021: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. అక్కడ మాత్రం భారీగా పెరిగిన రేట్లు..
Also Read: Gold Silver Price Today: గుడ్ న్యూస్.. మళ్లీ పతనమైన బంగారం ధర.. రూ.800 తగ్గిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ..
Also Read: Four Day Work Week: 4 రోజులే పని.. పెరగనున్న బేసిక్ పే.. మారనున్న సాలరీ స్ట్రక్చర్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
- - - - - - - - - Advertisement - - - - - - - - -