Revanth controversial comments: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు నియామక పత్రాలు అందించే సభలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవి కేసీఆర్ గురించి చేసినవేనని వారంటున్నారు.
స్టేచర్ ..స్ట్రెచ్చర్..మార్చరీ !
ఇటీవల బీఆర్ఎస్ నేతలు సీఎం పదవి నిర్వహించే స్టేచర్ గురించి మాట్లాడుతున్న అంశాన్ని రేవంత్ సభలో ప్రస్తావించారు. కొంతమంది స్టేచర్ , స్టేచర్ అని మాట్లాడుతున్నారని, స్టేచర్ ఉందని విర్రవీగినవారు స్ట్రెచర్ మీదకు వెళ్లారని ఇట్లానే వ్యవహరిస్తే మార్చూరీకి కూడా వెళ్లవచ్చని అన్నారు. స్టేచర్ అనేది స్థానానికి తప్ప వ్యక్తులకు ఉండదన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ ఆర్థికంగా క్యాన్సర్ ఇచ్చారని, క్యాన్సర్ ముదురుతుంటే రాష్ట్రం దివాళా తీసిందంటారా అని అంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాన్ని ఎన్నాళ్ళు దాచిపెడతారని ? నేను వాస్తవాలు చెబుతుంటే…దిగిపో దిగిపో అని మాట్లాడుతున్నారన్నారు. మీరు ఆయనను కుర్చి నుంచి లాగేసి నన్ను ఆ కుర్చీలో ఐదేళ్ల కాలానికి కూర్చోబెట్టారన్నారు. నన్ను పనిచేయనివ్వాలి కదా.. కేసీఆర్ కుటుంబం మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ లా అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాడ్ డాగ్ లా మాట్లాడుతున్నారని ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబసభ్యులకు సూచించారు.
రేవంత్ కు పొలిటికల్ మెచ్యూరిటీ లేదన్న హరీష్ రావు
పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితి కి నిదర్శనం ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్షనేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ళ మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డి ది పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మరింతగా రేగే అవకాశం ఉంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు ఉన్న సమయంలో రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు మరింత వేడి పుట్టించనున్నాయి.