Pawan Kalyan first case : పవన్ కల్యాణ్ చొరవ - 9 నెలల తర్వాత వీడిన యువతి మిస్సింగ్ మిస్టరీ - అసలు ట్విస్ట్ వేరే
Vijayawada : పవన్ కల్యాణ్ చొరవ తీసుకుని పోలీసుల్ని ఆదేశించడంతో ఓ యువతి మిస్సింగ్ కేసు 9 నెలల తర్వాత వీడింది. ఆ యువతిని జమ్మూ నుంచి ప్రత్యేక పోలీసు బృందం తీసుకు వచ్చింది.
Deputy CM Pawan Kalyan : భీమవరానికి చెందిన శివకుమారి కుమార్తె 9 నెలల కిందట మిస్ అయింది. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ.. పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఎవరికి గోడు వెళ్లబోసుకున్నా వినిపించుకున్న వారు లేరు. కానీ జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు తమ బాధ వెల్లడించిన వారంలోనే వారికి ఉపశమనం లభించింది. వారి కుమార్తె ఆచూకీ తెలిసింది.
అసలేం జరిగిందంటే ?
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజాదర్భార్ నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ప్రజాదర్భార్‌లో భీమవరానికి చెందిన శివకుమారి పాల్గొన్నారు. విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని పవన్ కల్యాణ్ ముందు కన్నీటితో మొరపెట్టుకుంది. మాచవరం పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశామని, తమ కూతురు జాడ తెలిసినా పోలీసులు స్పందించడం లేదని వేదన చెందారు.
#JanaVaani #PawanKalyanAneNenu
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2024
మిస్సింగ్ కేసు పై స్వయంగా రంగంలోకి దిగిన ఉప ముఖ్యమంత్రి
విజయవాడలో చదువుకుంటున్న తన కుమార్తె మైనర్ అనీ... ఆమెను ప్రేమ పేరిట ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని, గత తొమ్మిది నెలలుగా ఆమె జాడ తెలియడం లేదని భీమవరం నుంచి వచ్చిన శివకుమారి అనే బాధితురాలు ఉప… pic.twitter.com/NNMZtUOQuC
అప్పటికప్పుడు సీఐకి ఫోన్ చేసిన పవన్ కల్యాణ్
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన వెంటనే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాచవరం సీఐకు ఫోన్ చేసి కేసు వివరాలు తెలుసుకున్నారు. దీనిపై చర్యలకు ఆదేశించారు. పార్టీ నాయకులను, బాధితులను పార్టీ ఆఫీస్ వాహనంలోనే మాచవరం పోలీస్ స్టేషన్ కు పంపించారు. స్వయంగా డిప్యూటీ సీఎం ఆదేశించడంతో పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. యువతి విజయవాడ రామవరప్పాడుకు చెందిన యువకుడుతో జమ్మూలో ఉన్నట్లు గుర్తించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. జమ్మూ నుంచి ఇద్దరినీ విజయవాడకు స్పెషల్ టీం తీసుకు వసస్తోంది.
పలు మిస్సింగ్ కేసులపై గతంలో పవన్ ఆరోపణలు
పవన్ కల్యాణ్ గతంలో ఏపీలో యువతుల మిస్సింగ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. జాతీయ గణాంకాలు కూడా అదే చెప్పాయి. ఇప్పుడు స్వయంగా ఆయన ఓ మిస్సింగ్ కేసుపై దృష్టి పెట్టి ..పోలీసుల్ని పరుగులు పెట్టించడంతో ఇతరు మిస్సింగ్ కేసులపై అధికారులు దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జమ్మూ నుంచి యువతిని తీసుకు వచ్చిన తర్వాత పోలీసులు పూర్తి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రేమ పేరుతో తీసుకుపోయినా.. ఆ అమ్మాయి మైనర్ అయితే.. తీసుకుపోయిన యువకుడిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టే అవకాశం ఉంది.