Andhra Pradesh Assembly Sessions Breaking News: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్

Breaking News Today: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఏపీలో ఈసారి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను మాత్రమే ప్రవేశ పెట్టనున్నారు.

Khagesh Last Updated: 22 Jul 2024 10:05 AM
Andhra Pradesh Assembly Sessions Breaking News: టీడీపీ సభ్యులు పసుపు కండువాలతో- వైసీపీ నల్ల కండువాలతో రాక 

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు టీడీపీ నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పసుపు కండువాతో సభకు వచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని నల్ల కండువాలతో వైసీపీ సభ్యులు సభకు వచ్చారు. 

అసెంబ్లీకి చేరుకున్న స్పీకర్ అయ్యన్న

అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అసెంబ్లీకి చేరుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిని మర్యాదపూర్వకంగా స్వాగతం పలికిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. కార్యక్రమంలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరావు, రాజమండ్రి ఎమ్మెల్యే అధిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు. 

Background

Andhra Pradesh Budget Sessions 2024: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభంకానున్నాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లోనే 23వ తేదీన ఓటాన్ అకౌంటర్ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మూడు శ్వేత పత్రాలను కూడా రిలీజ్ చేయనుంది. 


ఈసారి ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌


మొదటి రోజు ఉదయం పది గంటలకు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశంకానుంది. ఉభయ సభలను ఉద్దేశించి అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. తర్వాత బీఏసీ సమావేశం అవుతుంది. ఈ భేటీలో సభను ఎన్ని రోజులు నడపాలి ఏ ఏ అంశాలపై చర్చించాలనే విషయాలపై నిర్ణయం తీసుకుంటారు. ఓటాన్ అకౌంట్‌తోపాటు సమావేశాలు జరిగే రోజుల్లో చేపట్టే ఇతర అజెండా ఖరారు చేస్తారు. 
మరోసారి ఓటాన్ బడ్జెట్


23న సభ ముందుకు బడ్జెట్‌


ప్రభుత్వం కొలువు దీరి కేవలం నలభై రోజులు మాత్రమే అవుతుంది. అందుకే ఈ పరిస్థితిలో అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకొని పూర్తి స్థాయి బడ్జెట్ రూపకల్పనకు సమయం పడుతుంది. అందుకే ఈసారి కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి వచ్చే నిధులపై కూడా స్పష్టత లేకపోవడంతో రెండునెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ తీసుకొస్తున్నారు. 


రెండోసారి సమావేశాలు
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు నెల్లోనే రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. మొదట సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర ఎన్నిక చేపట్టారు. అనంతరం వాయిదా పడ్డాయి. ఈసారి సమావేశాల్లో బడ్జెట్‌ ఆమోదం, శ్వేత పత్రాల విడుదల ఉంటుంది. మొదటి సమావేశాల్లోనే ఓటాన్అకౌంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని చూసినా అప్పటికి ఇంకా ప్రభుత్వం కుదురుకోలేదని ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


సభలో మూడు శ్వేతపత్రాలు విడుదల 


ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం మూడు శ్వేత పత్రాలు రిలీజ్ చేయనుంది. ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలను సీఎం చంద్రబాబు రిలీజ్ చేశారు. పోలవరం, అమరావతి, సహజ వనరుల దోపీడీ, విద్యుత్‌ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేశారు. లా అండ్ ఆర్డర్, ఆర్థిక శాఖ, ఆర్థిక స్థితిగతులపై ప్రభుత్వం మూడు శ్వతపత్రాలు విడుదల చేయనుంది. 


పసుపు చొక్కాలు- సైకిల్ కండువాలు


సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించి సభా సమావేశాలకు బయల్దేరతారు. అందరూ పసుపురంగు దుస్తులు ధరించి రావాలని అధినాయకత్వం ఆదేశించినట్టు చెబుతున్నారు. 



ప్రత్యేక బందో బస్తు


గుంటూరు జిల్లీ ఎస్పీ నేతృత్వంలో సమావేశాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. బందోబస్తు విధుల్లో మొత్తం 1500 మంది పోలీసు సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల నుంచి సిబ్బందిని అసెంబ్లీ సమావేశాల విధుల కోసం రప్పించారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 


Also Read: సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు- టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు డ్రెస్ కోడ్ ఆదేశాలు! 


Also Read: గవర్నర్‌ను కలిసిన మాజీ సీఎం జగన్ - టీడీపీ దాడులపై ఫిర్యాదు

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.