PM Modi With Indian Workers In Kuwait: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్‌లో పని చేస్తోన్న భారతీయ కార్మికులతో సంభాషించారు. దేశ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని కొనియాడారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కువైట్‌కు వెళ్లిన ప్రధాని.. గల్ఫ్ స్పిక్ లేబర్ క్యాంప్‌ను సందర్శించారు. అక్కడి భారతీయ కార్మికుల ఆకాంక్షల గురించి మాట్లాడారు. "వికసిత్ భారత్ 2047"  దార్శనికతతో వారిని అనుసంధానం చేశారు. 


'12 గంటలు పనిచేయాలనిపిస్తోంది'


“నేను వికసిత్ భారత్ 2047 గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడికి పని చేయడానికి వచ్చిన నా దేశంలోని కార్మిక సోదరులు కూడా అతని గ్రామంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఎలా నిర్మించాలో ఆలోచిస్తారు. ఈ ఆకాంక్షే నా దేశానికి బలం’’ అని ప్రధాని మోదీ అన్నారు. "మన రైతులు, కూలీలు పొలాల్లో ఎంతో కష్టపడుతున్నారనే దాని గురించి నేను రోజంతా ఆలోచిస్తూంటాను" అని భారతీయ రైతులు, కూలీల శ్రమను కూడా ఆయన గుర్తించారు. ఇంటరాక్షన్ సందర్భంగా, రైతులు, కార్మికుల అంకితభావం తనను కష్టపడి పని చేయడానికి ప్రేరేపిస్తుందని మోదీ అన్నారు. వీళ్లంతా 10, 11 గంటలు కష్టపడి పనిచేయడం చూస్తుంటే నేను కూడా 11 గంటలు పనిచేయాలి. అవసరమైతే 12 గంటలు పని చేయాలనిపిస్తుందని చెప్పారు.


“మీరు మీ కుటుంబం కోసం కష్టపడుతున్నట్టే నేను నా కుటుంబం కోసం పని చేస్తున్నాను. నా కుటుంబంలో 140 కోట్ల మంది ఉన్నారు. కాబట్టి నేను కొంచెం ఎక్కువ పనిచేయాలి” అని మోదీ తెలిపారు. కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. ప్రతి చోటా ప్రజలకు సులభంగా కమ్యూనికేషన్‌ను సులభతరం చేసే చౌకైన డేటా రేట్లను కలిగి ఉన్న భారతదేశం గురించి మాట్లాడారు. "భారతదేశంలో చౌకైన డేటా (ఇంటర్నెట్) ఉంది. మనం ప్రపంచంలో ఎక్కడైనా లేదా భారతదేశంలో కూడా ఆన్‌లైన్‌లో మాట్లాడాలనుకుంటే దానికయ్యే ఖర్చు చాలా తక్కువ. మీరు వీడియో కాన్ఫరెన్స్‌లు చేసినా, కూడా ఖర్చు చాలా తక్కువే. ఈ విషయంలో ప్రజలకు గొప్ప సౌలభ్యం ఉంది. వారు ప్రతిరోజూ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడవచ్చు” అని మోదీ చెప్పారు.





 43ఏళ్లలో .. తొలి ప్రధాని


43 ఏళ్లలో గల్ఫ్ దేశం కువైట్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. కువైట్ పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి షేక్ సాద్ అల్ అబ్దుల్లా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ‘హలా మోదీ’ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సమయంలో, అతను బ్లూ కాలర్ భారతీయ కార్మికులు నివసించే లేబర్ క్యాంపును కూడా సందర్శించారు. కువైట్‌లో భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇక్కడ మినీ ఇండియా ఆవిర్భవించిందని అన్నారు. భారతదేశంలోని ప్రతి ప్రాంతం నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చారని ప్రధాని చెప్పారు. గతంలో కూడా విదేశాల్లోని భారతీయ కార్మికులతో మోదీ సమావేశమై వారితో సంభాషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2016లో ప్రధాని మోదీ సౌదీ అరేబియాలోని రియాద్‌లోని ఎల్‌అండ్‌టీ కార్మికుల నివాస సముదాయాన్ని సందర్శించారు. 


Also Read : Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!