Instant Personal Loan: మెడికల్‌ బిల్లు, స్కూల్‌ లేదా కాలేజీ ఫీజ్ లేదా బండి రిపేర్‌ వంటి ఆకస్మిక పరిస్థితుల్లో డబ్బు అవసరమైతే, వెంటనే డబ్బు సర్దుబాటు చేసుకోవడానికి పర్సనల్ లోన్ సాయం తీసుకోవచ్చు. బ్యాంక్‌లు లేదా NBFCలు పర్సనల్‌ లోన్‌ ఆఫర్‌ చేస్తాయి. మీ అప్లికేషన్‌తో అవి సంతృప్తి చెందితే, సాధారణంగా, మీరు అప్లై చేసిన గంట లోపలే లోన్‌ మంజూరు చేస్తాయి. కేవలం 5 నిమిషాల్లో లోన్‌ ఇస్తాం / 10  నిమిషాల్లో రుణం ఇస్తామని చెప్పుకుంటున్న డజన్ల కొద్దీ మొబైల్ అప్లికేషన్‌లు (యాప్‌లు) కూడా ఇప్పుడు మీ స్మార్ట్‌ ఫోన్‌లో ఉన్నాయి. మీకు ఎప్పుడైనా అర్జంట్‌గా డబ్బులు అవసరమైతే, అలాంటి ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ను ఉపయోగించుకోవచ్చు. 


ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌


బజాజ్ ఫిన్‌సర్వ్ (BajajFinserv Loan App): ఈ బ్యాంక్ రూ. 40 లక్షల వరకు వ్యక్తిగత రుణాలను అందిస్తుంది. ఈ యాప్‌లో వివరాలు నింపి, రుజువు పత్రాలు సమర్పించిన వెంటనే రుణం లభిస్తుంది.


క్రెడిట్ బీ (Credit Bee Loan App): ఇంట్లో పెళ్లి అయినా లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ అయినా, క్రెడిట్ బీ రూ. 1,000 నుంచి రూ. 5 లక్షల వరకు రుణాలు ఇస్తుంది. ఇందులో లోన్‌ ప్రాసెస్‌ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతుంది. 10 నిమిషాల్లో మీ బ్యాంక్‌ ఖాతాలోకి లోన్‌ క్రెడిట్‌ చేస్తామని క్రెడిట్ బీ చెబుతోంది.


మనీవ్యూ (Moneyview Loan App): మనీవ్యూ కూడా, 10 నిమిషాల్లో రూ. 10 లక్షల వరకు రుణం ఇస్తామంటూ హోరెత్తిస్తోంది. ఇందులో, మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేసి లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ తర్వాత, మీ మొబైల్‌ నంబర్‌కు OTP వస్తుంది. అక్కడి నుంచి రుణం ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుంది. 


లోన్‌ట్యాప్ (LoanTap Loan App): ఈ యాప్‌ ద్వారా ఇన్‌స్టాంట్‌ లోన్‌ తీసుకోవడానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి, తగిన రుజువు పత్రాలు సమర్పించాలి. రుణదాత ధృవీకరణ తర్వాత, రుణానికి వెంటనే ఆమోదం లభిస్తుంది, లోన్‌ అమౌంట్‌ మీ బ్యాంక్‌ ఖాతాకు బదిలీ అవుతుంది. ఆ డబ్బుతో మీ అవసరం తీర్చుకోవచ్చు.


ఎంపాకెట్‌ (mPokket Loan App): ఇది కూడా ఇన్‌స్టంట్ లోన్ యాప్, 10 నిమిషాల్లో లోన్ ఇస్తామని ప్రచారం చేస్తోంది. రుణం కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. ఈ యాప్‌లో.. మీ పాన్ (PAN) & ఆధార్‌ (Aadhar)ను ఉపయోగించి ఆన్‌లైన్‌లో KYC పూర్తి చేయాలి. మీరు కాలేజీలో చదివుతున్నట్లయితే ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, ఉద్యోగం చేస్తుంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.


జెస్ట్‌మనీ (ZestMoney Loan App): మీరు జెస్ట్‌మనీ యాప్‌లో కూడా లోన్ అప్లై చేయవచ్చు. ఈ యాప్‌లోనూ మీ పాన్‌, ఆధార్‌ను ఉపయోగించి KYC ప్రాసెస్‌ పూర్తి చేయాలి. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి ఆటోమేటిక్ రీపేమెంట్ ఆప్షన్‌ను కూడా మీరు ఎంచుకోవచ్చు. ఆఫ్‌లైన్ & ఆన్‌లైన్ స్టోర్‌లలో చెల్లింపుల కోసం కూడా జెస్ట్‌ను ఉపయోగించవచ్చు.


క్యాషీ (CASHe Loan App): ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెనస్‌ (AI)-ఆధారిత యాప్‌ ఇది. రుణగ్రహీత క్రెడిట్ స్కోర్‌ (Credit score) తక్కువ ఉన్నప్పటికీ, అతని వ్యక్తిగత ఇమేజ్ ఆధారంగా రుణాలు ఇస్తుంది. ఈ విధంగా త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ అత్యవసర పరిస్థితుల్లో తక్షణ రుణ సౌకర్యాన్ని అందిస్తుంది. 


ముఖ్య గమనిక


మార్కెట్‌లో నిపుణుల అభిప్రాయాలను, సర్వేలను ఆధారంగా చేసుకొని ఈ సమాచారానని షేర్ చేస్తున్నాం. వీటికి ఏబీపీకి ఎలాంటి బాధ్యత వహించదు. మార్కెట్‌లో జెన్యూన్‌ కంపెనీలతోపాటు చాలా ఫేక్‌ లోన్‌ యాప్స్‌ కూడా ఉన్నాయి. ముందువెనుక ఆలోచించకుండా అలాంటి ఫేక్‌ యాప్స్‌ నుంచి లోన్‌ తీసుకుంటే, అతి భారీ మొత్తంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, అవి మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా చోరీ చేస్తాయి, మీ పరువును బజారులో నిలబెడతాయి. ఈ విషయాలను మైండ్‌లో పెట్టుకుని లోన్‌ యాప్‌ తలుపు తట్టడం మంచిది. ఇప్పుడు ఇచ్చిన యాప్‌లలో కూడా మీరు ఆయా బ్యాంకు నిపుణులతో మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోండి. 


మరో ఆసక్తికర కథనం: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?