Game Changer Pre Release Event : గల్లీలో ఎవడైనా ఆడతాడు.. ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆడేవాడికి ఓ క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ ఏంటో అమెరికా డల్లాస్‌లో జరిగిన ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ వేడుకను చూస్తే తెలుస్తుంది. ఏపీ, తెలంగాణ, ఇంకా చెప్పాలంటే ఇండియాలో మన హీరోలు అటెండ్ అయితే క్రౌడ్ ఉండటం మాములే. కానీ అమెరికాలో స్టేడియం పట్టనంత జనం రావడమంటే.. అది మాములు విషయం కానే కాదు. ‘ఆర్ఆర్ఆర్’తో వచ్చిన రామ్ చరణ్ గ్లోబల్ రేంజ్ ఏంటనేది తాజాగా జరిగిన ఈ ప్రీ రిలీజ్ వేడుక తెలియజేస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ‘ఇండియన్’ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ అమెరికా నుండి స్టార్ట్ చేశారు.
ప్రమోషన్స్‌లో భాగంగా డిసెంబర్ 21న (ఇండియాలో డిసెంబర్ 22 ఉదయం) యు.ఎస్‌లోని డల్లాస్‌లో ఛరిష్మా డ్రీమ్స్ రాజేష్ కల్లెపల్లి ఆధ్వర్యంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు. ఈ వేడుక ఎంత గ్రాండ్‌గా జరిగింది అంటే.. సోషల్ మీడియాలో ‘గేమ్ చేంజర్’ అని టైప్ చేస్తే చాలు.. ఫుల్ క్రౌడ్‌తో నిండిన వీడియోలే తెలియజేస్తున్నాయి. కర్టిస్ కల్‌వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్, గార్‌లాండ్ టి.ఎక్స్ 75040లో జరిగిన ఈ వేడుకకు స్టేడియం సామర్థ్యం ఎనిమిది వేలు మాత్రమే. కానీ స్టేడియం నిండిపోయి.. స్టేడియం బయట కూడా అంతే మంది క్యూలో నిలబడినట్లుగా కొన్ని వీడియోలు చూస్తుంటే.. ఇది కదా తెలుగువారి అభిమానం అని అనకుండా ఉండలేరు. అసలు ఇంత క్రౌడ్‌ని చిత్ర టీమ్ కూడా ఊహించి ఉండదు.
మరో విశేషం ఏమిటంటే.. అమెరికాలో ఒక తెలుగు సినిమాకి ఇలాంటి వేడుక జరగడం ఇదే ఫస్ట్ టైమ్ కావడం. ఈ విషయంలో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా రికార్డ్‌ని క్రియేట్ చేసినట్లే. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియోను, ఆ క్రౌడ్‌ని చూసిన వారంతా.. ఇది ఏపీనో, తెలంగాణో అని అనుకుంటారేమో.. ఇది డల్లాస్. ఇది రామ్ చరణ్ క్రేజ్ అంటూ పోస్ట్‌లు చేస్తుండటం చూస్తుంటే.. టాలీవుడ్‌లో మరో వెయ్యి కోట్ల సినిమా లైన్‌లో ఉందని ఫిక్సయిపోవచ్చు కూడా. ఇక ఇదే వేడుకపై ‘గేమ్ చేంజర్’ చిత్రం నుండి విడుదల చేసిన నాల్గవ సాంగ్ ‘డోప్’ కూడా బీభత్సమైన ఆదరణను రాబట్టుకుంటోంది. ట్రెండ్‌ని బద్దలు కొడుతూ.. టాప్ 1లో ఈ సాంగ్ దూసుకెళుతోంది. మొత్తంగా అయితే.. ‘గేమ్ చేంజర్’ మొదటి స్టెప్ బిగ్ సక్సెస్ అయినందుకు టీమ్ అంతా హ్యాపీగా ఉంది. దిల్ రాజు కూడా ఆ ఆనందంలో స్టేజ్‌పై మాట్లాడుతూ.. ఇండియాలో ఉన్న భాషలన్నింటిలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామని ప్రకటించేశారంటే, ఆయన ఎలా విహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ కూడా ఇన్‌స్టా వేదికగా క్రౌడ్‌తో సెల్ఫీ వీడియోని షేర్ చేసి థ్యాంక్యూ యుఎస్ఏ అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఎస్.జె.సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. తమిళంలో ఎస్‌వీసీ, ఆదిత్య రామ్ మూవీస్, హిందీలో ఏఏ ఫిల్మ్స్ అనీల్ తడానీ విడుదల చేస్తున్నారు. నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్