Mahesh Babu : నటించమంటే భయపడి పారిపోయిన మహేష్!

Continues below advertisement

అందంలో 'రాజకుమారుడు'.. అమ్మాయిలను ఫిదా చేసే 'పోకిరి'.. ఇండస్ట్రీలో రికార్డులు కొల్లగొట్టే 'బిజినెస్ మెన్' సూపర్ స్టార్ మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన మహేష్ బాబు ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. గతేడాది 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో అలరించిన మహేష్ త్వరలోనే 'సర్కారు వారి పాట' అంటూ ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఈ సందర్భంగా అతడికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. 


నటించమంటే పారిపోయిన మహేష్: 

మహేష్ బాబుకి చాలా సిగ్గు.. అందుకే పార్టీలకు కూడా పెద్దగా అటెండ్ అవ్వరు. సమయం దొరికితే కుటుంబంతో గడిపేస్తుంటారు. తన సిగ్గు కారణంగా కెరీర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. తొలి సినిమాలో నటించమని అడిగితే భయపడి పారిపోయానని.. యూనిట్ వాళ్లు పట్టుకుంటే సినిమాలో నటించనని మారాం చేశానని ఓ సందర్భంలో మహేష్ బాబు చెప్పారు. ఆ తరువాత బిస్కెట్లు, చాకెట్లు ఇచ్చి తనను కన్విన్స్ చేశారని.. తన తొలి సినిమా సంగతులు చెప్పారు. 


లెక్కలంటే భయం: 


చదువుకునే రోజుల్లో మహేష్ ఏవరేజ్ స్టూడెంట్. ఆయనకి లెక్కలంటే చాలా భయమట. పదో తరగతిలో ఆయనకి లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చాయి. దీంతో లయోలా కాలేజ్ లో ఇంటర్ చదవాలనుకున్న ఆయన కోరిక తీరలేదు. దీంతో కష్టపడి సీటు తెచ్చుకొని డిగ్రీ లయోలా కాలేజ్ లో చేశారు. 


మహేష్ బాబు క్రష్ : 


26 ఏళ్ల వయసులో మహేష్ బాబుకి క్రష్ ఉండేదట. ఆమెనే తరువాత పెళ్లి చేసుకున్నానని మహేష్ అభిమానులతో ఓసారి చెప్పారు. 


నమ్రత కోసం ముంబైలో.. 



2000వ సంవత్సరంలో విడుదలైన 'వంశీ' సినిమాలో నమ్రత, మహేష్ కలిసి నటించారు. సెట్స్ లో మహేష్ ఎవరితో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. కానీ నమ్రతతో మాట్లాడడం మొదలుపెట్టిన తరువాత వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారడంతో మహేష్ కు తన ప్రేమ విషయాన్ని ఫోన్ చేసి చెప్పింది నమ్రత. అతడికి కూడా ఇష్టం ఉండడంతో వెంటనే ఓకే చెప్పేశాడు. ఆ సమయంలో నమ్రత కోసం ముంబై వెళ్లి అక్కడే ఒక చిన్న రూమ్ లో ఉంటూ ఆమెని కలిసేవాడు మహేష్. 


మీడియాకు కౌంటర్.. 



దాదాపు నాలుగేళ్లు ప్రేమించిన ఈ జంట పెద్దలను ఒప్పించి సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లికి ముందు ఒక్కసారి కూడా మీడియా కంట పడలేదు. దీంతో మహేష్ బాబు సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో మహేష్ 'మీకు చెప్పకపోతే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లేనా..? నా పెళ్లిలో మా రెండు కుటుంబాలు ఉన్నాయి. అది సీక్రెట్ పెళ్లి కాదంటూ' మీడియాకు ఘాటుగా బదులిచ్చారు. 


నమ్రతతో గొడవలు.. 



పెళ్లైన మూడేళ్లకు నమ్రతకు, మహేష్ కు మధ్య గొడవలు వచ్చాయి. దీంతో నమ్రత కొడుకుని తీసుకొని ముంబైకి వెళ్లిపోయింది. కానీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, ఒకరినొకరు అర్ధం చేసుకునే విధానం వారిని తిరిగి కలిపింది. అయితే ఈ గొడవలన్నీ కూడా తమను మరింత దగ్గర చేశాయని నమ్రత ఓ సందర్భంలో చెప్పారు. తమ బంధానికి సంబంధించిన పునాదులు బలంగా ఉన్నాయంటే.. అలాంటి గొడవలు కూడా కారణమేనని నమ్రత చెబుతుంటుంది. 


సిగరెట్లు ఎలా మానారంటే.. 


మహేష్ బాబు ఒకప్పుడు చైన్ స్మోకర్ అట. ఎన్నిసార్లు మానేయాలనుకున్నా మళ్లీ మళ్లీ కాలుస్తూనే ఉండేవారట. అలాంటి సమయంలో మహేష్ స్నేహితుడు తనకొక బుక్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. అదే అలెన్ కార్ రాసిన 'ఈజీ వే టు స్టాప్ స్మోకింగ్'. ఈ పుస్తకం చదివిన తరువాత తాను ఇంతవరకు అసలు సిగరెట్ అన్నదే ముట్టుకోలేదని మహేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను నటించే సినిమాల్లో కూడా సిగరెట్ తాగే సన్నివేశాలు వద్దనే చెబుతానని, దానివల్ల అభిమానులకు తప్పుడు సందేశం వెళ్తుందని అన్నారు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram