WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) దూసుకుపోతుంది. గుజరాత్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. గుజరాత్ జెయింట్స్ ( Gujarat Giants ) ను 32 పరుగుల తేడాతో ఓడించింది. ఆర్సీబీ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ ( Shreyanka Patil ) ఐదు వికెట్లు పడగొట్టి, మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది.
ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఫస్ట్ బ్యటింగ్ చేసింది. ఓపెనర్లు గ్రేస్ హారిస్ ( Grace Harris ), స్మృతి మంధాన ( Smriti Mandhana ) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. మిడిల్ ఆర్డర్ లో రాధా యాదవ్ అద్భుత బ్యాటింగ్‌తో టీమ్ కు భారీ స్కోర్ ను అందించింది. రాధా యాదవ్ ( Radha Yadav ) 47 బంతుల్లో 3 సిక్సర్లు, 6 ఫోర్లతో 66 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించింది. దాంతో ఆర్సీబీ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 182 పరుగులు చేసింది.
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 18.5 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్సీబీ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటర్లు నిలవలేక పొయ్యారు. ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా మూడో విజయాన్ని అందుకుంది. పాయింట్ల టేబుల్ లో ఆర్సీబీ అగ్రస్థానంలో నిలిచింది.