Ind vs NZ Rohit Sharma Records | మరో రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ
భారత్, న్యూజిలాండ్ ( India vs New Zealand ) మధ్య మూడవ వన్డే మ్యాచ్ ఇండోర్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత మాజీ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. భారత్ న్యూజీలాండ్ మధ్య జరుగుతున్న ఈ సిరీస్ 1-1తో సమం అయింది. ఇక మూడవ వన్డే డిసైడింగ్ మ్యాచ్ కానుంది.
ఈ సిరీస్ లో రోహిత్ ఎక్కువ పరుగులు చేయలేదు. తొలి వన్డేలో 26 పరుగులు చేయగా, రెండో వన్డేలో 24 పరుగులకు ఔటయ్యాడు. మూడో వన్డేలో రోహిత్ బ్యాట్ నుంచి పరుగులు వస్తాయిని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ గా పాకిస్తాన్ బ్యాటర్ షాహిద్ అఫ్రిదికి ( Shahid Afridi ) రికార్డ్ ఉంది. ఈ రికార్డును రోహిత్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అఫ్రిది 50 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు న్యూజిలాండ్‌పై వన్డేల్లో 49 సిక్సర్లు కొట్టాడు. ఇండోర్‌లో రోహిత్ మరో 2 సిక్సర్లు కొడితే పాక్ బ్యాటర్ షాహిద్ అఫ్రిది రికార్డును బద్దలు కొడతాడు. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా నిలవనున్నాడు.