Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
ప్రభాస్ స్పిరిట్ సినిమా నుంచి ఓ అప్డేట్ వచ్చింది. అందరూ ఊహించినట్లుగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉంటుందని భావించింది తప్పన్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రిలీజ్ డేట్ పోస్టర్ తో షాక్ ఇచ్చాడు. 2027 అంటే వచ్చే ఏడాది మార్చి 5న ప్రభాస్ స్పిరిట్ సినిమాను విడుదల చేస్తున్నట్లు సందీప్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి ప్రభాస్ నుంచి రాజాసాబ్ సినిమా వచ్చింది. అయితే రాజాసాబ్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కానీ సంక్రాంతికి రిలీజైన అనిల్ రావిపూడి చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకువెళ్తోంది. వరుసగా సంక్రాంతికి ఫ్యామిలీతో హిట్స్ కొడుతున్న అనిల్ కి పోటీకి ఎందుకు అనుకున్నారో..ఫ్యామిలీ మూవీస్ పండుగగా సంక్రాంతికి మార్చేస్తున్న టైమ్ లో వయొలెంట్ ఫిలిం ఎందుకున్నారో కానీ వచ్చే ఏడాది మార్చి 5న స్పిరిట్ రిలీజ్ చేస్తామని సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశారు. చూడాలి ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ ఓ ఆడియో నోట్, ఫస్ట్ లుక్ మాత్రమే వచ్చాయి. సినిమా షూటింగ్ లో ఉంది. దీపికా పదుకోన్ ప్లేస్ లో తృప్తి దిమ్రి ప్రభాస్ కి పెయిర్ గా నటిస్తున్న ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.