Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

Continues below advertisement

న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ లో తొలి రెండు మ్యాచ్‌లకు స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను ( Arshdeep Singh ) తీసుకోలేదు. కనీసం ఆఖరి మ్యాచ్‌లోనైనా అతని ఆడించాలని అంటున్నారు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ( Ravichandran Ashwin ). హర్షిత్ రాణా ( Harshit Rana ), ప్రసిధ్ కృష్ణకు ( Prasidh Krishna ) మ్యాచ్‌ ప్రాక్టీస్ అవసరమని అన్నారు. 

'బౌలర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణాకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరం. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచుల్లో హిట్ ది డెక్ బౌలర్ అవసరం. కానీ న్యూజిలాండ్‌తో ఆ ఫార్మూలా వర్కౌట్ కాదు. అందుకే అర్ష్‌దీప్ సింగ్‌ను ప్లేయింగ్ 11 లో ఆడించాలి' అని వ్యాఖ్యానించారు అశ్విన్. 

నేను అర్ష్‌దీప్ సింగ్‌కు సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే అతని చేతికి బాల్ ఇచ్చిన ప్రతీసారి అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అందుకే అతనికి తుది జట్టులో చోటు కల్పించాలని కోరుతున్నా. అతనికి ఆ అర్హత ఉంది. తొలి రెండు వన్డేల్లో అర్ష్‌దీప్ సింగ్‌ను ఎందుకు తప్పించారు. అది అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయదా?' అని ప్రశ్నించారు అశ్విన్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola