తెలంగాణలో ప్రతిపాదిత ఆరు ప్రాంతాల్లో కొత్త ఎయిర్ పోర్టులకు సంబంధించిన అంశం సోమవారం పార్లమెంటులో చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ ఎంపీ కేసీఆర్ సురేశ్ రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన మంత్రి వీకే సింగ్ సమాధానం ఇచ్చారు. ఆరు గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్‌లో మూడు బ్రౌన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టులు ప్రతిపాదించినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఇందుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను స్టడీని పూర్తిచేసి తెలంగాణ ప్రభుత్వానికి అందించినట్లు పేర్కొన్నారు. వీటి నిర్మాణం పూర్తి కావడం అనేది భూసేకరణ, అనుమతులు, బిడ్డింగ్ ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని అన్నారు.
వచ్చే ఏడాదికి హైదరాబాద్ విమానాశ్రయం విస్తరణ పూర్తి
హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ వచ్చే ఏడాది డిసెంబర్ వరకు పూర్తవుతుందని పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు. విస్తరణ పూర్తయ్యాక విమానాశ్రయ ప్రయాణికుల సామర్థ్యం ఏడాదికి 1.2 కోట్ల స్థాయి నుంచి 3.4 కోట్లకు చేరుతుందని ఆయన తెలిపారు.
Also Read: ATM Alaram: ఏటీఎంలో దొంగతనం.. మోగిన అలారం.. పోలీసులు వచ్చారని ఊరంతా తెలిసింది ఈ చోరుడికి తప్ప..
Also Read: Hyderabad పాతబస్తీలో దారుణం.. కాళ్లావేళ్లా పడినా కనికరించని కసాయి తండ్రి.. బాలుడిపై పైశాచికత్వం!
Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా?
Also Read: ఆహారం తినకపోతే అంత ప్రమాదమా? మన శరీరం మనల్నే తినేస్తుందా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి